ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gandhi statue vandalised: లండన్‌లో మహాత్ముడి విగ్రహంపై పిచ్చి రాతలు.. జాత్యాహంకారుల దుశ్చర్య

ABN, Publish Date - Sep 30 , 2025 | 10:08 AM

బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యాహంకారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు.

Gandhi statue vandalised in London

బ్రిటన్ రాజధాని లండన్‌లో మహాత్మా గాంధీ విగ్రహంపై జాత్యాహంకారులు దుశ్చర్యకు పాల్పడ్డారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. మహాత్ముని జయంతికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహాత్మా గాంధీ విగ్రహంపై గాంధీ-మోదీ హిందుస్థాని టెర్రరిస్టులని నల్ల రంగుతో రాశారు. ఈ ఘటనను లండన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది (Gandhi statue vandalised London).

'మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. దీనిని తీవ్రంగా ఖడిస్తున్నాం. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన కేవలం విగ్రహం ధ్వంసం మాత్రమే కాదు. అహింస భావనపై, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడి' అని రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్‌ 2వ తేదీన ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు (India reacts to Gandhi statue vandalism).

లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహాన్ని, ప్రముఖ కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్‌ రూపొందించారు (Gandhi statue defaced UK). ఈ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌లోని యూనివర్సిటీ కాలేజ్‌ సమీపంలో 1968లో ప్రతిష్ఠించారు. తాజాగా ఈ విగ్రహంపై జాత్యాహంకారులు విద్వేషపూరిత రాతలు రాయడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..

దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే

Updated Date - Sep 30 , 2025 | 10:30 AM