22 Year Old Student Crushed: పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:50 PM
స్కూటీతో సహా కిందపడ్డ యువతి పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇండియాలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎంత చెప్పినా తక్కువే. ఇక, బెంగళూరు రోడ్లు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూ ఉన్నాయి. అక్కడి కొన్ని రోడ్లు చంద్రుడి ఉపరితలాన్ని తలపించేలా ఉంటాయి. గుంతలతో నిండిన ఆ రోడ్ల కారణంగా జనం తరచుగా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. సోమవారం ఉదయం కూడా ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ నిండు ప్రాణం రోడ్డుపై గుంతకు బలైంది. ఓ యువతి గుంతను తప్పించడానికి ప్రయత్నించి ప్రాణం కోల్పోయింది.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ధనుశ్రీ అనే 22 ఏళ్ల యువతి బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం ధనుశ్రీ స్కూటీపై కాలేజీకి బయలు దేరింది. బుడిగెరె క్రాస్ దగ్గరకు రాగానే ఓ గుంతను తప్పించడానికి ధనుశ్రీ స్కూటీని పక్కకు తిప్పింది. ఇదే ఆమె చేసిన సరిదిద్దుకోలేని తప్పు. స్కూటీ గుంత నుంచి పక్కకు రాగానే వెనకాలే వచ్చిన టిప్పర్ లారీ ఆమె స్కూటీని ఢీకొట్టింది.
స్కూటీతో సహా కిందపడ్డ ఆమె పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ధనుశ్రీ అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ లారీని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక, సమాచారం అందుకున్న అవలహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ధనుశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ‘హిట్ అండ్ రన్’ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగస్టు 27న అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల్లో రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చాలన్నారు. 30 రోజులు గడిచినా గుంతలు మాత్రం అలాగే ఉన్నాయి. దీంతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.
ఇవి కూడా చదవండి
ఐఫోన్ కొనడానికి డబ్బులివ్వండి ప్లీజ్.. ఫాలోవర్స్‌కు లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్ రిక్వెస్ట్..
పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..