Donations To Buy iPhone 17 Pro Max: ఐఫోన్ కొనడానికి డబ్బులివ్వండి ప్లీజ్.. ఫాలోవర్స్‌కు లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్ రిక్వెస్ట్..
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:03 PM
కొద్దిరోజుల క్రితమే తండ్రి ఆమెకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చాడు. ఆమెకు ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ ఫోన్ కొనాలని ఆశపుట్టింది. ఇందుకోసం తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పేశాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొత్త మోడల్స్ మార్కెట్‌లోకి వస్తే హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఉంటాయి. తాజాగా, ఐఫోన్ 17 సిరీస్ మార్కెట్‌లోకి వచ్చింది. భారత ప్రజలు కూడా ఎగబడి పోన్లను కొన్నారు. ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రో మ్యాక్స్ మోడల్ ధర ఆకాశాన్ని అంటేలా ఉంది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 256 జీబీ మోడల్ 1,49,900 రూపాయలు కాగా.. 512 జీబీ ధర 1,54,900 రూపాయలుగా ఉంది. ఇంత ఖరీదైన ఫోన్‌ను కొనుక్కోవటం పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టసాధ్యమైన పని.
అందుకే ఓ లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. తన ఫాలోవర్స్‌ను ఫోన్ కొనడానికి డబ్బులు అడుగుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. ఉత్తర ప్రదేశ్, లఖిమ్‌పుర్‌కు చెందిన మహీ సింగ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితమే తండ్రి ఆమెకు ఐఫోన్ 16 బహుమతిగా ఇచ్చాడు. ఆమెకు ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్ ఫోన్ కొనాలని ఆశపుట్టింది. ఇందుకోసం తండ్రిని డబ్బులు అడిగితే ఇవ్వనని చెప్పేశాడు. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనడానికి డబ్బులు ఇవ్వమని ఫాలోవర్స్‌ను రిక్వెస్ట్ చేస్తోంది.
‘ఐఫోన్ 17 సిరీస్ ఇప్పుడే లాంచ్ అయింది. నాకు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ బాగా నచ్చింది. దాని కలర్ కూడా నాకు బాగా నచ్చింది. మూడు నెలల క్రితమే మా నాన్న నాకు ఐఫోన్ 16 కొనిచ్చాడు. నాకు ఆ ఫోన్ తీసుకోవాలని ఉంది. అక్టోబర్ నెలలో నా బర్త్‌డే ఉంది. ఆ సమయానికి ఫోన్ తీసుకోవాలి. మా నాన్న ఫోన్ కొనివ్వడం లేదు. మీరు గనుక తలా రూపాయి, నాలుగు రూపాయలు ఇచ్చినా నేను ఫోన్ కొనుక్కుంటాను. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. వెంటనే డబ్బులు పంపించండి’ అంటూ తన సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. వీడియో కాస్తా వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పేరేచర్లలో తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..
ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. అడ్డుకున్న మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే..