Mayor Johnathan: ర్యాప్ సింగర్ నుంచి న్యూయార్క్ మేయర్‌గా..
ABN, Publish Date - Nov 07 , 2025 | 05:29 AM
న్యూయార్క్ నగర మేయర్‌గా విజయం సాధించి సంచలనం సృష్టించిన జోహ్రాన్ మమ్దానీ.. మొద ట్లో హౌజింగ్ కౌన్సెలర్‌గా పనిచేశారు.
హిందీ, బెంగాలీ, స్పానిష్ భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగల జోహ్రాన్ మమ్దానీ
పేదలకు ఇళ్లు, ఉచిత ప్రజా రవాణా హామీలు
మోదీ యుద్ధ నేరస్తుడు అంటూ గతంలో విమర్శలు
న్యూయార్క్, నవంబరు 6: న్యూయార్క్ నగర మేయర్‌గా విజయం సాధించి సంచలనం సృష్టించిన జోహ్రాన్ మమ్దానీ.. మొద ట్లో హౌజింగ్ కౌన్సెలర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే పేదలు సొంతింటి కోసం ఎంతగా తపిస్తారో చూశారు. ఆ సమయంలోనే ర్యాప్ సింగర్‌గా మారారు. ‘యంగ్ కార్డమామ్, మిస్టర్ కార్డమామ్’ పేరుతో కొన్నిపాటల వీడియోలూ చేశారు. న్యూయా ర్క్ ఆధునిక హిప్-హాప్ సంగీతాన్ని, దక్షిణాసియా బాణీలను కలగలిపి ప్రయత్నించారు. రాజకీయాల్లోకి వచ్చాక మంచి ప్రజాదరణ పొందారు. 2020లో డెమొక్రాట్ పార్టీ తరఫున న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. పేదలకు ఇళ్లు, ఉచిత ప్రజా రవాణా, ఉచితంగా పిల్లల సంక్షేమం, అద్దెల నియంత్రణ కోసం గట్టిగా డిమాండ్ చేశారు. ధనికులపై పన్నులు పెంచి వీటిని అమలు చేస్తానని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో వాగ్దానం చేశారు. అమెరికాకు మిత్రదేశమైన ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఒకవేళ న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తామనీ ప్రకటించారు. ప్రధాని మోదీని ‘యుద్ధ నేరస్తుడు (వార్ క్రిమినల్)’ అంటూ విమర్శించి కలకలం రేపారు. వలసలకు వ్యతిరేకంగా ట్రంప్ చేపట్టిన చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. హిందీ, బెంగాలీ, స్పానిష్ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడగలిగిన మమ్దానీ.. న్యూయార్క్‌లో స్థిరపడిన భారతీయులు, ఇతర విదేశీయులనూ ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు బలమైన మద్దతు లభించింది. మమ్దానీ తాను ముస్లిం అన్న విషయాన్ని ఎక్కడా దాచుకోలేదు. మసీదులకు కూడా వెళ్లారు. జాతి, మతం అనే వివక్ష ఏదీ ఉండదని.. న్యూయార్క్‌లో ఉండే అందరి సంక్షేమమే తన లక్ష్యమని ప్రకటించారు. చివరికి విజయం సాధించారు.
Updated Date - Nov 07 , 2025 | 05:29 AM