ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Former Sri Lanka President Ranil Wickremesinghe : నిధుల దుర్వినియోగ ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్టు

ABN, Publish Date - Aug 22 , 2025 | 03:13 PM

ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను అరెస్టు చేశారు. కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ ముందు హాజరైన తర్వాత ఈ అరెస్టు జరిగింది.

Former Sri Lanka President Ranil Wickremesinghe

కొలంబో, ఆగస్టు 22 : ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ముందు హాజరైన తర్వాత ఈ అరెస్టు జరిగింది. ప్రభుత్వ నిధులు ఖర్చుపెట్టి ఆయన లండన్‌కు ప్రైవేట్ విజిట్ చేశారన్నది ఈ అరెస్ట్ లో ముఖ్య ఆరోపణ.

తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విక్రమసింఘే, లండన్ లోని ఒక విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారు. ఇది అధికారిక పర్యటన కాదని, అయితే, ప్రభుత్వ డబ్బుతో ఈ పర్యటన సాగిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో అరెస్ట్ అనివార్యమైంది. దీనికి సంబంధించి ఈ నెల మొదటి వారంలో మాజీ అధ్యక్ష కార్యదర్శి సమన్ ఏకనాయకే, మాజీ ప్రైవేట్ కార్యదర్శి సాండ్రా పెరెరాలను దర్యాప్తు సంస్థ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

రణిల్ విక్రమసింఘే 2022 నుండి 2024 వరకు శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవలి కాలంలో అత్యంత సీనియర్ రాజకీయ వ్యక్తి శ్రీలంకలో అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. రణిల్ విక్రమసింఘే అరెస్ట్‌తో ఉన్నతాధికారుల ప్రజా నిధుల దుర్వినియోగంపై మరింత ముమ్మర దర్యాప్తుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు.

శ్రీలంక దేశానికి రణిల్ విక్రమసింఘే ఆరుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 2024 సెప్టెంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు అనుర కుమార దిసానాయకే చేతిలో ఓడిపోయి పదవిని కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి, త్వరలో జనాభా మిషన్‌: ప్రధాని మోదీ

కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం

Updated Date - Aug 22 , 2025 | 03:13 PM