ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Roman Starovoit: రష్యా మాజీ మంత్రి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య .. పుతిన్ నిర్ణయమే కారణమా

ABN, Publish Date - Jul 07 , 2025 | 09:27 PM

స్టారో వాయిట్‌ను డిస్మిస్ చేస్తూ పుతిన్ ప్రకటించిన ప్రెసిడెంట్ డిక్రీని క్లెమిన్ వెబ్‌సైట్‌ పబ్లిష్ చేసింది. అయితే అతని ఉద్వాసనకు కారణమేమిటనేది అందులో చెప్పలేదు. అయితే పదవి నుంచి స్టారో వాయిట్‌ను తప్పించాలనే నిర్ణయం చాలా నెలల క్రితమే తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రష్యా వాణిజ్య వార్తాపత్రిక 'వేదోమోస్తీ' తెలిపింది.

Roman Starovoit

మాస్కో: రష్యా మాజీ రవాణా శాఖ మంత్రి రోమన్ స్టారో వాయిట్ (Roman Starovoit) సోమవారం నాడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఆయనను పదవి నుంచి తొలగించిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటుచేసుకుంది. మాస్కో శివార్లలోని ఓ పార్కింగ్ ప్లేస్‌లోని తన కారులో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. అయితే నిర్దిష్ట కారణాలపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని చెప్పారు.

స్టారో వాయిట్‌ను డిస్మిస్ చేస్తూ పుతిన్ ప్రకటించిన ప్రెసిడెంట్ డిక్రీని క్రెమ్లిన్ వెబ్‌సైట్‌ పబ్లిష్ చేసింది. అయితే అతని ఉద్వాసనకు కారణమేమిటనేది అందులో చెప్పలేదు. అయితే పదవి నుంచి స్టారో వాయిట్‌ను తప్పించాలనే నిర్ణయం చాలా నెలల క్రితమే తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రష్యా వాణిజ్య వార్తాపత్రిక 'వేదోమోస్తీ' తెలిపింది.

రష్యా అధ్యక్షుడిగా పుతిన్ తిరిగి ఎన్నిక కావడంతో 2024 మేలో స్టారో వాయిట్ రవాణా మంత్రిగా నియమితులయ్యారు. మంత్రిగా ఏడాది నుంచి సేవలందిస్తున్నారు. దీనికి ముందు ఆయన 2018 నుంచి 2024 వరకూ కుర్క్స్ ప్రాంతానికి గవర్నర్‌గా పనిచేశారు. ఆయన గవర్నర్‌గా ఉన్నప్పుడు 2024 ఆగస్టులో ఉక్రెయిన్ మిలటరీ కుర్క్‌పై దాడి చేసింది. దీనిపై స్క్రూటినీ జరగగా.. సరిహద్దు పటిష్టతలో లోటుపాట్లు ఉన్నట్టు ఈ స్క్రూటినీలో వెలుగుచూసిందని చెబుతున్నారు. గవర్నర్‌గా ఉన్న అనుభవంతో ఆయనను రవాణా శాఖ మంత్రిగా నియమించిన పుతిన్ ప్రభుత్వం తాజాగా ఆయన స్థానంలో నోవ్‌గోరెడ్ గవర్నర్ ఆండ్రీ నికిటిన్‌ను నియమించింది. ఈ నేపథ్యంలో స్టారో వాయిట్ ఆత్మహత్యకు పాల్పడటం సంచలనమవుతోంది.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గాలి తీసిన మస్క్.. ఇలా అంటాడనుకోలేదు..

మరోసారి రెచ్చిపోయిన ట్రంప్.. బ్రిక్స్ దేశాలకు వార్నింగ్

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 09:42 PM