Share News

Trump Threatens BRICS: మరోసారి రెచ్చిపోయిన ట్రంప్.. బ్రిక్స్ దేశాలకు వార్నింగ్

ABN , Publish Date - Jul 07 , 2025 | 10:56 AM

Trump Threatens BRICS: అమెరికాతో బిజినెస్ చేసే బ్రిక్స్ దేశాలపై నూటికి నూరు శాతం టారీఫ్ విధిస్తామని హెచ్చరించారు. కాగా, బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఉన్నాయి.

Trump Threatens BRICS: మరోసారి రెచ్చిపోయిన ట్రంప్.. బ్రిక్స్ దేశాలకు వార్నింగ్
Trump Threatens BRICS

అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కల్లు తాగిన కోతిలాగా రెచ్చిపోతున్నారు. తోటి దేశాలపై పెత్తనం చేయడానికి చూస్తున్నారు. అగ్రరాజ్యం అధ్యక్ష పదివిలో ఉన్నానన్న గర్వంతో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాల సమావేశంపై స్పందించారు. బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు వ్యతిరేకంగా ఏవైనా పాలసీలు తీసుకువస్తే.. బ్రిక్స్ దేశాలపై అదనంగా మరో 10 శాతం తారీఫ్ విధిస్తానని అన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో సోమవారం ఓ పోస్టు పెట్టారు.


ఆ పోస్టులో..‘బ్రిక్స్ తీసుకువచ్చే యాంటీ అమెరికన్ పాలసీలకు ఏ దేశం అయినా మద్దతు పలికితే.. ఆ దేశంపై అదనంగా మరో 10 శాతం తారీఫ్ విధిస్తాము. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. జులై 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెరికా టారిఫ్‌కు సంబంధించిన లెటర్‌లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలకు పంపుతాము. ఈ విషయంపై దృష్టి సారించినందుకు మీకు ధన్యవాదాలు’ అని అన్నారు. బ్రిక్స్ దేశాలు.. డాలర్‌‌కు ప్రత్యామ్నాయం తీసుకువస్తే.. అమెరికా ఆర్థికంగా దెబ్బ తింటుందని ట్రంప్ భావిస్తున్నారు.


అదే గనుక జరిగితే అమెరికాతో బిజినెస్ చేసే బ్రిక్స్ దేశాలపై నూటికి నూరు శాతం టారీఫ్ విధిస్తామని హెచ్చరించారు. కాగా, బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు ఉన్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా ఈ దేశాలు కలిసి కట్టుగా ఓ నిర్ణయం తీసుకుంటే.. అది అమెరికాకు భారీ నష్టాన్ని తెస్తుంది. భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. అందుకే ట్రంప్ భయపడిపోతున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే..

డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..

Updated Date - Jul 07 , 2025 | 12:46 PM