Share News

Tumkur Husband: ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే..

ABN , Publish Date - Jul 07 , 2025 | 09:53 AM

Tumkur Husband: నవీన్ ఓ కూరగాయల మార్కెట్‌లో పని చేసేవాడు. వారంలో రెండు రోజులు మాత్రమే పనికి పోయేవాడు. మిగిలిన రోజులు ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. బాగా తాగేవాడు కూడా. ఈ నేపథ్యంలోనే నవీన్, గీతలు తరచుగా గొడవలు పడేవారు.

Tumkur Husband: ప్రేమ పెళ్లి.. ప్రతీ రోజూ గొడవలే.. కట్ చేస్తే..
Tumkur Husband

ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రేమ ఏమైందో తెలీదు కానీ.. ప్రతీ రోజూ గొడవ పడేవారు. ఆ గొడవలు రోజురోజుకు పెరిగి.. భార్య హత్యకు దారి తీసింది. భర్త తన భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని తుమ్కూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమ్కూరుకు చెందిన నవీన్, గీతలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు మొదలయ్యాయి.


నవీన్ ఓ కూరగాయల మార్కెట్‌లో పని చేసేవాడు. వారంలో రెండు రోజులు మాత్రమే పనికి పోయేవాడు. మిగిలిన రోజులు ఇంట్లో ఖాళీగా ఉండేవాడు. బాగా తాగేవాడు కూడా. ఈ నేపథ్యంలోనే నవీన్, గీతలు తరచుగా గొడవలు పడేవారు. ఇంటి ఓనర్ కలుగజేసుకుని గొడవ ఆపాల్సి వచ్చేది. ఈ గొడవలు ఎక్కువవటంతో రెండు సార్లు ఇళ్లు ఖాళీ చేయించాడు. అయితే, అధిక రెంటులు కట్టలేక మళ్లీ వెనక్కు తిరిగి వచ్చారు. అయినా గొడవలు మాత్రం ఆగలేదు. శనివారం రాత్రి నవీన్ తాగి ఇంటికి వచ్చాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.


నవీన్ గొడవ సందర్భంగా గీతను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. మరుసటి రోజు ఇంటి యజమాని కొడుకు అక్కడికి వచ్చాడు. నవీన్ మూడు నెలలుగా రెంటు కట్టకపోవటంతో అడగడానికి వచ్చాడు. ఇంటి దగ్గరకు రాగానే అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గీత రక్తం మడుగులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది..

మస్క్ కొత్త పార్టీపై ట్రంప్ విమర్శలు.. అది అయ్యేది కాదంటూ..

Updated Date - Jul 07 , 2025 | 01:16 PM