ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nepal Minister Arzu Rana Deuba: నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే

ABN, Publish Date - Sep 10 , 2025 | 03:33 PM

నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా సతీమణి ఆర్జూ రాణా దేవుబా ఫొటోలు నెట్టింట కలకలం రేపుతన్నాయి. రోజుల వ్యవధిలో ఆమె జీవితం తలకిందులైన వైనంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.

Arzu Rana Deuba injured

ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఇటీవలి వరకూ నేపాల్ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆర్జూ రానా దేవుబా. ఆమె భర్తేమో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా. నేపాల్ రాజకీయాల్లో ఇద్దరూ కీలక నేతలే. అధికారం, హంగూ ఆర్భాటాలకు ఏమాత్రం లోటులేని బ్యాక్ గ్రౌండ్. కానీ చూస్తుండగానే వారి జీవితం తలకిందులైపోయింది. కొద్ది రోజుల క్రితం అధికారిక లాంఛనాల మధ్య ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్జూ దేవుబాపై ప్రజాగ్రహం వెల్లువెత్తి హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రక్తమోడుతున్న మొహంతో ఆమె ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిన దుస్థితి దాపురించింది. ఆమె జీవితం ఎలా తలకిందుయ్యిందో చెప్పే ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి (Arzu Rana Deuba injured).

సుమారు ఐదు రోజుల క్రితం మంత్రి ఆర్జూ దేవుబా అమెరికా విమానాలను ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె అధికారిక హోదాతో వెలిగిపోతూ కనిపించారు. ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న ఆమె ఫొటోలు నెట్టింట సహజంగానే వైరల్ అయ్యాయి. ఆ తరువాత కొన్ని రోజులకే నేపాల్‌ను జెన్ జీ నిరసనలు సునామీలా ముంచెత్తాయి. ప్రభుత్వ అధికారాలు, మందిమార్బలంతో హోదా వెలగబెట్టిన వారంతా ఈ జనసునామీలో కొట్టుకుపోయారు (Sher Bahadur Deuba wife attacked).

మాజీ ప్రధాని దేవుబా ఇంటిపై కూడా నిరసనకారులు దాడి చేయడంతో దేవుబా, ఆయన భార్య ఆర్జూ ఏమీ చేయలేక చూస్తుండిపోయారు. ప్రాణాలతో ఎలా బయటపడాలో తెలియక తల్లడిల్లిపోయారు. చివరకు కొందరు ఆ జంటపై కూడా దాడి చేయడంతో ఆర్జూ ముఖం రక్తసిక్తమైంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేపాల్ పరిస్థితులకు కారణాలు ఏమైనప్పటికీ జనాగ్రహం పెల్లుబికితే ఎంతటి వారైనా అధోగతి పాలవ్వాల్సిందేనంటూ నెట్టింట జనాలు ఈ ఫొటోలపై కామెంట్ చేస్తున్నారు (Before After Pics Arzu Deuba).

సోషల్ మీడియాపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ మొదట కదం తొక్కిన జనాల దృష్టి ఆ తరువాత అక్కడి పాలకవర్గాల అక్రమాలు, అన్యాయాలపై పడి నిరసనలు హింసాత్మక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యావత్ దేశాన్ని నేపాల్ ఆర్మీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ నిరసనలకు ముగింపు పలికేందుకు రాష్ట్రపతి రామ్‌చంద్ర పాడేల్ మరికాసేపట్లో నిరసనకారులతో సమావేశం కానున్నారు.

ఇవి కూడా చదవండి:

హమాస్‌ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి

నేపాల్ జెన్ జీ నిరసనలు.. ప్రజలను రక్షించుకుంటామన్న ఆర్మీ చీఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 10 , 2025 | 03:49 PM