ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vatican City: నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రివోస్ట్‌

ABN, Publish Date - May 09 , 2025 | 04:40 AM

నూతన పోప్‌గా 69 ఏళ్ల రాబర్ట్‌ ప్రివోస్ట్‌ (పోప్ లియో-14) ఎన్నికయ్యారు. ఇది చరిత్రలో తొలిసారిగా ఓ అమెరికన్‌ను పోప్‌గా ఎన్నిక చేసిన సందర్భం.

  • చరిత్రలో తొలిసారి ఓ అమెరికన్‌ ఎన్నిక

వాటికన్‌సిటీ, మే 8: నూతన పోప్‌గా అమెరికాకు చెందిన 69 ఏళ్ల రాబర్ట్‌ ప్రివోస్ట్‌ ఎన్నికయ్యారు. ఆయన్ను పోప్‌ లియో- 14గా పిలవనున్నారు. 133 మంది కార్డినల్‌లు శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యంత రహస్యంగా సమావేశమై నూతన పోప్‌ను ఎన్నుకున్నారు. దీనికి సూచికగా వాటికన్‌లోని ప్రాచీన సిస్టన్‌ చాపెల్‌ చర్చి పొగగొట్టం నుంచి తెలుపు రంగు పొగ వెలువడింది. పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నిక కావడం చరిత్రలో ఇదే తొలిసారి. నూతన పోప్‌ ఎన్నిక ఖరారుతో ప్రజల హర్షధ్వానాలతో సెయింట్‌ పీటర్స్‌ స్కేర్‌ మార్మోగిపోయింది. అత్యున్నత కార్డినల్‌ నూతన పోప్‌ పేరును ప్రకటించారు. అనంతరం నూతన పోప్‌ తొలిసారి ప్రజలకు బహిరంగంగా కనిపించారు. అమెరికాలోని షికాగోలో జన్మించిన రాబర్ట్‌ ప్రివో్‌స్టకు పెరూ పౌరసత్వం కూడా ఉంది. ఆర్చ్‌బిష్‌పగా ఎన్నో ఏళ్ల పాటు ఆయన పెరూలో సేవలందించారు. 2023లో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయన్ను వాటికన్‌కు పిలిపించి ఓ కీలక పదవి అప్పగించారు. ఈ ఏడాది జనవరిలో కార్డినల్‌గా నియమితులయ్యారు.

Updated Date - May 09 , 2025 | 04:41 AM