ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: ట్రంప్ ప్రతిపాదిత బిల్లుపై మస్క్ మరోసారి విమర్శలు

ABN, Publish Date - Jun 29 , 2025 | 08:10 AM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఎలాన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈ బిల్లుతో అమెరికాకు భారీ వ్యూహాత్మక నష్టం జరుగుతుందని అన్నారు.

Elon Musk Trump Bill Criticism

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి విమర్శలు గుప్పించారు. ట్రంప్ ప్రతిపాదిస్తున్న బిల్లు మూర్ఖపు చర్య అని, విధ్వంసకారకమని మరోసారి స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే అమెరికాకు వ్యూహాత్మక నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ‘సెనెట్ ముసాయిదా బిల్లుతో లక్షల్లో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. మన దేశానికి వ్యూహాత్మక కీడు జరుగుతుంది. ఈ బిల్లుతో పాత తరం పరిశ్రమలకు ఉచితాలు, కొత్త తరం పరిశ్రమలకు నష్టం మిగులుతుంది’ అని ఎక్స్ వేదికగా స్పందించారు.

ట్రంప్ ప్రతిపాదిత బిల్లుకు అమెరికా ఎగువ సభ సభ్యుల మద్దతు ఉంది. ఈ విషయంలో జూలై 4 లోపు పురోగతి సాధించాలని ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. దీంతో, రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు గడువు లోపు పని పూర్తి చేసేందుకు ఉరుకులుపరుగులు పెడుతున్నారు. తాజా బిల్లులో కొన్ని పరిశ్రమలకు పన్ను రాయితీలతో పాటు మెడికెయిడ్ కార్యక్రమం నిధుల్లో కోతలు, రక్షణ, డిపోర్టేషన్‌కు అదనపు నిధుల కేటాయింపు వంటి అనేక అంశాలు ఉన్నాయి.

ఈ బిల్లులో సరిహద్దులు, దేశ భద్రతకు ఏకంగా 350 బిలియన్ డాలర్లు కేటాయించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు గోడను విస్తరించేందుకు 46 బిలియన్ డాలర్లు, వలసదారుల డిటెన్షన్ బెడ్స్ కోసం 45 బిలియన్ డాలర్లు, వలసల శాఖలో 10 వేల మంది సిబ్బంది నియామకం కోసం భారీగా నిధులను కేటాయించారు. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్రమ వలసదారులను దేశం దాటించాలన్న ట్రంప్ నిర్ణయానికి ఈ బిల్లు కీలకంగా మారింది. డెమోక్రెటిక్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా రిపబ్లికన్లు మాత్రం బిల్లు ఆమోదానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, మెడికెయిడ్, ఫుడ్ స్టాంప్స్‌‌ కార్యక్రమాలకు నిధుల కోతపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:

కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన

ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 08:22 AM