ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రంప్‌పై పెట్టిన పోస్టులపై మస్క్‌ విచారం

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:26 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి గత వారం తాను చేసిన కొన్ని సోషల్‌ మీడియా పోస్టులపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ విచారం వ్యక్తం చేశారు.

  • అవి చాలా దూరం వెళ్లాయని వ్యాఖ్య

వాషింగ్టన్‌, జూన్‌ 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి గత వారం తాను చేసిన కొన్ని సోషల్‌ మీడియా పోస్టులపై టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల సీఈవో ఎలాన్‌ మస్క్‌ విచారం వ్యక్తం చేశారు. అవి చాలా దూరం వెళ్లాయంటూ బుధవారం ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు. ట్రంప్‌ ప్రభుత్వం నుంచి మస్క్‌ వైదొలిగాక టీవీ ఇంటర్వ్యూల్లోనూ, సోషల్‌ మీడియా పోస్టుల్లోనూ ఇరువురూ పరస్పరం విమర్శించుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరూ వైరాన్ని పక్కన పెట్టనున్నట్టు మంగళవారమే సంకేతాలు వెలువడ్డాయి. మస్క్‌తో మాట్లాడాలనే ఆలోచన ఉందా? అని విలేకరులు ట్రంప్‌ను ప్రశ్నించగా.. తనకు ఆ ఆలోచన ఏమీ లేదని, అయితే తానే గనుక మస్క్‌ స్థానంలో ఉంటే మాట్లాడాలనే ఆలోచన చేసేవాడినని చెప్పారు.

చైనాతో డీల్‌ కుదిరింది: ట్రంప్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11: చైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఓ డీల్‌ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. ఇందులో భాగంగా చైనా తమకు అరుదైన ఖనిజాలను సరఫరా చేస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా చైనా అమెరికాకు పూర్తి మ్యాగ్నెట్‌లను, అవసరమైన అన్ని అరుదైన ఖనిజాలను సరఫరా చేస్తుందని ట్రంప్‌ తెలిపారు. ఇందుకు బదులుగా చైనా విద్యార్థులు అమెరికా కళాశాలలు, వర్సిటీల్లో చదువుకొనేందుకు అనుమతిస్తామన్నారు. చైనా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువుల మీద 55 శాతం, అమెరికా నుంచి చైనాకు ఎగుమతయ్యే ఉత్పత్తుల మీద 10ు టారి్‌ఫలు అమలవుతాయని తెలిపారు. ఈ ఒప్పందాన్ని తాను, చైనా అధ్యక్షుడు ఆమోదించడమే తరువాయి అని ట్రంప్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

రాజీవ్‌ యువ వికాసం మరింత జాప్యం

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 12 , 2025 | 05:26 AM