ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Praises Musk: ఆయన ఎప్పటికీ మనతోనే..మస్క్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం

ABN, Publish Date - May 30 , 2025 | 10:23 AM

డోజ్ శాఖ నుంచి తప్పుకున్న మస్క్‌పై ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన టెరిఫిక్ అని కితాబునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.

Trump Praises Musk

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా డోజ్ శాఖ నుంచి తప్పుకున్న బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మస్క్ టెరిఫిక్ అంటూ ఆకాశానికెత్తేశారు. ఇద్దరం కలిసి కాసేపట్లో పత్రికా సమావేశంలో పాల్గొంటామని పేర్కొంది. ఇది మస్క్‌కు చివరి సమావేశమైనా కూడా అతనెప్పుడూ తమ వెంటే ఉంటారని అన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు పెట్టారు.

అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించి డబ్బు పొదుపు చేసే దిశగా సలహా సూచనలు చేసేందుకు డొజ్ శాఖ ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటివరకూ ఎలాన్ మస్క్ నేతృత్వం వహించారు. అయితే, పొదుపు చర్యల పేరిట డోజ్ శాఖ మార్గదర్శకత్వంలో చేపట్టిన ఉద్యోగుల తొలగింపులు తీవ్ర విమర్శలకు దారి తీశాయి.


ప్రభుత్వ ఖర్చులు పెంచే దిశగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై మస్క్ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ బిల్లు చట్టంగా మారితే డోజ్ శాఖ కృషి వృధా అయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో మస్క్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, తనకు డోజ్ శాఖలో అవకాశం ఇచ్చినందుకు ట్రంప్‌కు మస్క్ ధన్యవాదాలు తెలిపారు. డోజ్ శాఖ భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం మస్క్ భారీ స్థాయిలో విరాళాలు సమకూర్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచాక ట్రంప్‌కు మస్క్ వెన్నంటే ఉన్నారు. తన ప్రసంగాల్లో ట్రంప్ కూడా మస్క్‌ను పలు పర్యాయాలు ప్రశంసించారు. ఓ స్టార్ పుట్టాడని ఓ సందర్భంలో కితాబునిచ్చారు. ఇక మస్క్ నేతృత్వంలోని డోజ్ శాఖ అనేక పొదుపు చర్యలకు ఉపక్రమిస్తూ ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేసింది. ఉద్యోగుల తొలగింపులను కూడా చేపట్టింది. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసి చివరకు మస్క్ ప్రతిష్ఠ మసకబారేలా చేసింది. ఫలితంగా అనేక ఐరోపా దేశాల్లో టెస్లా కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.

ఇవీ చదవండి:

ఆపరేషన్ సిందూర్‌తో దీటైన జవాబిచ్చాం.. సిక్కిం రాష్ట్ర అవతరణ వేడుకల్లో ప్రధాని మోదీ

ఉగ్రవాదంపై యుద్ధం.. భారత్‌కు మద్దతుగా జర్మనీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 11:28 AM