ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump - Karoline Leavitt: వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..

ABN, Publish Date - Dec 10 , 2025 | 10:42 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్‌పై ప్రశంసలు కురిపించారు. అందమైన ముఖం, మెషీన్ గన్‌లా కదిలే పెదవులతో టీవీ ఇంటర్వ్యూల్లో అమెరికా ప్రభుత్వ విధానాలను గట్టిగా సమర్థిస్తుందని వ్యాఖ్యానించారు. ఆమె సూపర్ స్టార్ అని కీర్తించారు.

Trump Praises karoline Leavitt

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రభుత్వ నిర్ణయాలను గట్టిగా సమర్ధించే వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరొలైన్ లెవిట్‌పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. టీవీ ఇంటర్వ్యూల్లో ఆమె దూకుడు అద్భుతమైని కొనియాడారు. ఈ షోలల్లో ఆమెదే ఆధిపత్యమని అన్నారు. ఆమె అందమైన ముఖం, పెదాలను మెషీన్ గన్‌‌తో పోలుస్తూ పొగడ్తల్లో ముంచెత్తారు (Trump Karoline Leavitt Praise).

పెన్సిల్వేనియాలో జరిగిన ఓ ర్యాలీలో ట్రంప్.. తన ప్రభుత్వ ఆర్థిక విజయాల గురించి మాట్లాడుతూ కెరొలైన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ఈరోజు ఓ సూపర్ స్టార్ మాతో వచ్చారు. ఆమె నిజంగా గ్రేట్ కదా! ఫాక్స్‌ న్యూస్ లాంటి టీవీ చానళ్లల్లో ఇంటర్వ్యూల సందర్భంగా పూర్తిగా డామినేట్ చేస్తుంది. అందమైన ముఖం, మెషీన్‌ గన్‌లా కదిలే పెదాలు.. దడదడలాడిస్తుంది’ అని కామెంట్ చేశారు.

‘ఆమెకు అసలు భయం అనేదే తెలియదు. ఎందుకంటే మా ప్రభుత్వ విధానాలు సరైనవి. మా విధానంలో మహిళల క్రీడల్లో పురుషులు ఉండరు.. ట్రాన్స్‌జెండర్ భావజాలాన్ని ఎవరిపైనా రుద్దము. ప్రపంచమంతా అమెరికాకు వచ్చేలా సరిహద్దులను తెరిచిపెట్టము. కాబ్టటి, మనల్ని సమర్ధించడంలో ఆమె పని కొంత సులువు అయ్యింది’ అని అన్నారు. ట్రంప్ గతంలో కూడా కెరొలైన్‌పై ఇలాంటి ప్రశంసలు కురిపంచారు. ‘ఆమె ముఖం, ఆమె మేధోసంపత్తి, ఆమె పెదాలు.. అవి కదిలే తీరు.. అవి మెషీన్ గన్‌లా కదులుతాయి. కెరొలైన్‌ కంటే మెరుగైన ప్రెస్ సెక్రెటరీ మరెవరికీ లేరు’ అని అప్పట్లో కామెంట్ చేశారు.

2019-21 మధ్య కాలంలో అప్పటి ట్రంప్ ప్రభుత్వంలో కెరొలైన్ లెవిట్ (28) అసిస్టెంట్ ప్రెస్ సెక్రెటరీగా పనిచేశారు. నికొలస్ రిసియో అనే రియలెస్టేట్ డెవలపర్‌ను (60) వివాహమాడారు. వారికి నికో అనే కుమారుడు కూడా ఉన్నాడు. చట్టసభల ఎన్నికల్లో ఓసారి పోటీ పడిన ఆమె ఆ తరువాత జనవరిలో శ్వేత సౌధం ప్రెస్ సెక్రెటరీ బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యత చేపట్టిన అతి పిన్న వయసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఇవీ చదవండి:

మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన

ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు.. పాక్‌కు షాక్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 11 , 2025 | 08:04 AM