ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

ABN, Publish Date - May 08 , 2025 | 08:33 AM

Indo Pak Tension: పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్నారు.

Indo Pak Tension

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించారు. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయన్నారు. రెండు దేశాలు రాజీకి వచ్చి.. యుద్ధాన్ని ఆపాలన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. భారత్, పాకిస్తాన్ గురించి నాకు బాగా తెలుసు. ఆ రెండు దేశాలు సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలి. వాళ్లు యుద్ధాన్ని ఆపుతారని భావిస్తున్నాను.


ఇప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయని నమ్ముతున్నాను . ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రజలకు ముందే తెలుసని అనుకుంటున్నాను. రెండు దేశాలు చాలా కాలంనుంచి గొడవపడుతూనే ఉన్నాయి. చాలా చాలా దశాబ్దాల నుంచి గొడవపడుతున్నాయి. బాగా ఆలోచిస్తే.. శతాబ్ధాల నుంచి కూడా కావచ్చు. ఇదంతా వీలైనంత త్వరగా సద్దుమణుగుతుందని భావిస్తున్నాను. యుద్ధ వాతావరణ పరిస్థితి గురించి మాకు రిపోర్టులు అందాయి. కానీ, పాకిస్తాన్ పరిస్థితి గురించి సరైన అంచనా లేదు. వాటిపై ఓ కన్నేసి ఉంచాము’ అని అన్నారు.


పాక్ వెన్నులో వణుకు పట్టించిన సింధూర్

పహల్గామ్ టెర్రర్ అటాక్‌కు గుణపాఠంగా భారత ప్రభుత్వం సరైన విధంగా ఉగ్రవాదులకు సమాధానం చెప్పింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. పదుల సంఖ్యలో టెర్రరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 9 ప్రదేశాల్లో మిస్సైల్ దాడులు చేసినట్లు భారత రక్షణ శాఖ తెలిపింది. పాకిస్తాన్ మిలటరీపై దాడి చేయలేదని కూడా పేర్కొంది. పాక్‌లోని ముజఫరాబాద్, కోట్లీ, బహవ్వాల్‌పూర్‌లలో ఇండియా మిస్సైల్స్ దాడికి పాల్పడినట్లు పాక్ ఆర్మీ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

Aamir Khan: 12 రోజుల పాటు స్నానం చేయని ఆమీర్.. కారణం ఏంటంటే..

Father Takes Revenge: కూతురి హత్య.. ఏడాది తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తండ్రి..

Updated Date - May 08 , 2025 | 09:49 AM