Share News

Aamir Khan: 12 రోజుల పాటు స్నానం చేయని ఆమీర్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - May 08 , 2025 | 07:52 AM

Aamir Khan: స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉన్న మనిషి ఎలా ఉంటాడో.. తెరపై చూపించడానికి.. ఫీల్ రావడానికి అమీర్ స్నానం చేయటం మానేశారు. దాదాపు 12 రోజుల పాటు అసలు స్నానమే చేయలేదు.

Aamir Khan: 12 రోజుల పాటు స్నానం చేయని ఆమీర్.. కారణం ఏంటంటే..
Aamir Khan

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ 12 రోజుల పాటు స్నానం చేయలేదట. నీళ్లు లేకో.. స్నానం చేయటం ఇష్టంలేకో కాదు. క్యారెక్టర్‌లో ఫర్‌ఫెక్షన్ కోసం ఆయన 12 రోజులు స్నానం చేయకుండా ఉండిపోయారట. అలా రెండు సినిమాల కోసం స్నానం చేయలేదట. ఆమీర్ ఖాన్ 1989లో రాఖ్ అనే సినిమాలో.. 1998లో గుల్హన్ అనే సినిమాలో నటించారు. క్యారెక్టర్‌కు తగ్గట్టు తనను తాను మలుచుకోవాలని ఆమీర్ భావించారు. ఓ సినిమాలో క్యారెక్టర్ విపరీతమైన గాయాలతో ఉంటుంది.. మరో సినిమాలో క్యారెక్టర్ చాలా రోజులు స్నానం చేయకుండా ఉంటుంది.


గాయాలతో ఉన్న మనిషిలా కంటిన్యుటీ కోసం.. స్నానం చేయకుండా ఎక్కువ రోజులు ఉన్న మనిషి ఎలా ఉంటాడో.. తెరపై చూపించడానికి.. ఫీల్ రావడానికి ఆమీర్ స్నానం చేయటం మానేశారు. దాదాపు 12 రోజుల పాటు అసలు స్నానమే చేయలేదు. స్నానం చేయకుండా యాక్టింగ్ చేశారు. ఈ విషయాన్ని ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఆమీర్ మాట్లాడుతూ.. ‘ రాఖ్ సినిమా చేస్తున్నపుడు. నేను 12 రోజుల పాటు స్నానం చేయలేదు. ఎందుకంటే.. ఇంటినుంచి బయటకు వచ్చేసిన వ్యక్తి రోడ్లపై తిరుగుతూ ఉంటాడు.


అది నా పాత్ర. పాత్ర సహజంగా ఉండాలని నేను స్నానం చేయలేదు. తర్వాత మరో సినిమా కోసం కూడా చాలా రోజులు స్నానం చేయకుండా ఉన్నాను. గుల్షన్ సినిమా క్లైమాక్స్‌లో ఓ పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. నేను అందులో బాగా దెబ్బలు తింటాను. క్రమక్రమంగా నా గాయాలు పెరుగుతూ ఉంటాయి. నేను గనుక ప్రతీ రోజు స్నానం చేస్తే కంటిన్యుటీ దెబ్బతింటుంది. అందుకే స్నానం చేయకూడదని నిశ్చయించుకున్నా. ఎందుకంటే నేను గనుక స్నానం చేస్తే ప్రెష్‌గా కనిపిస్తా. అది నాకు నచ్చలేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Father Takes Revenge: కూతురి హత్య.. ఏడాది తర్వాత ప్రతీకారం తీర్చుకున్న తండ్రి..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. లైవ్‌లో పాక్ యాంకర్ కన్నీరు..

Updated Date - May 08 , 2025 | 08:05 AM