Donald Trump: ఆ గొప్ప దేశంతో ట్రంప్ ట్రేడ్ డీల్.. సస్పెన్స్‌లో పెట్టేశాడు..
ABN, Publish Date - May 08 , 2025 | 11:08 AM
Donald Trump: ట్రంప్ చెప్పిన ఆ గొప్ప, గౌరవ ప్రధమైన దేశం ఏది అన్నది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. అమెరికా, చైనాల మధ్య తారీఫుల విషయంలో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. అమెరికా దెబ్బకు చైనా వెనకడుగు వేసింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆదాయం విషయంలో ఎక్కడా తగ్గేదేలా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యధిక తారీఫులతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. అయితే, అమెరికాతో వాణిజ్యపరమైన ఒప్పందాలు చేసుకున్న దేశాలకే తారీఫులలో మార్పులు ఉంటాయని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ పెద్ద దేశం అమెరికాతో ట్రేడ్ డీల్‌కు సిద్ధం అయిందట. ట్రేడ్ డీల్‌కు సంబంధించిన విషయాన్ని ట్రంప్ స్వయంగా తెలియ జేశారు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ రేపు ఉదయం 10.00 గంటలకు ఓవల్ ఆఫీస్‌లో ఓ పెద్ద మీడియా ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. ఓ గొప్ప గౌరవ ప్రధమైన దేశంతో మేజర్ ట్రేడ్ డీల్ చేసుకోబోతున్నాము’ అని పేర్కొన్నారు. అయితే, ట్రంప్ చెప్పిన ఆ గొప్ప, గౌరవ ప్రధమైన దేశం ఏది అన్నది సస్పెన్స్‌గా మిగిలిపోయింది. అమెరికా, చైనాల మధ్య తారీఫుల విషయంలో గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి.
పోటా పోటీగా ఒక దేశంపై మరో దేశం తారీఫులు విధించుకున్నాయి. చైనాపై అమెరికా ఊహించని స్థాయిలో తారీఫులు విధించింది. ‘ తక్కువ తారీఫుల కారణంగా ప్రతీ ఏటా లక్షల కోట్ల డాలర్లను నష్టపోతున్నాం. ఇకపై పోగొట్టుకోము’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా దూకుడును చైనా తట్టుకోలేకపోయింది. వెనకడుగు వేసింది. రేపు అమెరికా ట్రేడ్ డీల్స్ చేసుకోబోయే దేశం చైనానే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తం 25 ట్రేడ్ డీల్స్‌పై సంతకాలు చేసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్
Updated Date - May 08 , 2025 | 11:10 AM