ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100 శాతం సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం

ABN, Publish Date - May 05 , 2025 | 07:18 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా రెండు సంచనల నిర్ణయాలను ప్రకటించి మళ్లీ చర్చనీయాంశంగా మారారు. ఈసారి కూడా మళ్లీ సుంకాల ప్రకటన చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన సుంకాల విషయంలో ఇప్పటికే అనేక దేశాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా రెండు సంచలన ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో మొదటిది విదేశాల్లో నిర్మించిన అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధించడం, రెండోది 60 ఏళ్లకు పైగా మూతపడి ఉన్న కాలిఫోర్నియాలోని ఆల్కాట్రాజ్ జైలును పునఃప్రారంభించి, విస్తరించడం. ఈ రెండు నిర్ణయాల గురించి ట్రంప్ ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాం ద్వారా పోస్ట్ చేసి వెల్లడించారు.


చలనచిత్రాలపై 100% సుంకం

అమెరికా చలనచిత్ర పరిశ్రమ వేగంగా క్షీణిస్తోంది. ఇతర దేశాలు మన నిర్మాతలు, స్టూడియోలను తమ వైపు ఆకర్షించడానికి అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. హాలీవుడ్‌తో పాటు అమెరికాలోని ఇతర ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. ఇది ఇతర దేశాల సమన్వయ కుట్ర, జాతీయ భద్రతకు ముప్పు, అంతేకాదు విదేశీ ప్రచారం కూడా అని ట్రంప్ ఆరోపించారు. ఈ సమస్యను ఎదుర్కొవడానికి, విదేశాల్లో నిర్మించిన అన్ని చలనచిత్రాలపై 100 శాతం సుంకం విధించే ప్రక్రియను వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే ప్రారంభించాలని ఆయన ఆదేశించారు.


ప్రభావం ఉంటుందా..

ఈ నిర్ణయం ద్వారా దేశీయ చలనచిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించడం, హాలీవుడ్‌ను బలోపేతం చేయడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ ప్రకటన అమెరికా చలనచిత్ర పరిశ్రమలో పెద్ద చర్చను రేకెత్తించింది. ఓ వైపు సుంకం విదేశీ చలనచిత్రాల ధరలను పెంచి, అమెరికా మార్కెట్‌లో వాటి పోటీ తత్వాన్ని తగ్గిస్తుందని అంటున్నారు అక్కడి వర్గాలు. దీనివల్ల స్థానిక నిర్మాతలు, స్టూడియోలు ప్రయోజనం పొందవచ్చు. కానీ అంతర్జాతీయ సినిమాలకు ఈ సుంకం వల్ల టికెట్ ధరలు పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అమెరికా స్టూడియోలు విదేశాల్లో తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం కోల్పోవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


ఆల్కాట్రాజ్ జైలు పునఃప్రారంభం

చలనచిత్ర సుంకం ప్రకటనతో పాటు, ట్రంప్ మరో సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని ఆల్కాట్రాజ్ ద్వీపంలో ఉన్న, 1963 నుంచి మూతపడి ఉన్న ఆల్కాట్రాజ్ జైలును పునఃప్రారంభించి, విస్తరించాలని ఆయన ఆదేశించారు. ఈ జైలు ఒకప్పుడు అమెరికాలో అత్యంత భద్రమైన జైలుగా పేరుగాంచింది. దీనిని తిరిగి తెరవడం ద్వారా అమెరికా అత్యంత క్రూరమైన, హింసాత్మక నేరస్థులను ఇక్కడ ఉంచాలని భావిస్తోంది. గతంలో మన దేశం గంభీరంగా ఉన్నప్పుడు అత్యంత ప్రమాదకరమైన నేరస్థులను జైలులో ఉంచి, వారిని ఎవరికీ హాని చేయకుండా దూరంగా ఉంచేవాళ్లమని గుర్తు చేశారు ట్రంప్.


ఇవి కూడా చదవండి:

Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


RCB IPL 2025: ఐపీఎల్ 2025లో అగ్రస్థానంలో ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌ కోసం ఇంకా ఎన్ని గెలవాలి


Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 11:53 AM