ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Cats Care: వృద్ధుడి బంపర్ ఆఫర్.. పిల్లిని చూసుకుంటే కోట్ల ఆస్తి మీదే..

ABN, Publish Date - Jul 06 , 2025 | 11:44 AM

Cats Care: తను చనిపోతే ఆ పిల్లి పరిస్థితి ఏంటి ? అన్న భయం ఆయనకు పట్టుకుంది. తను చనిపోయిన తర్వాత కూడా క్షియాన్బాను ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమగా పెంచుకునే వారికోసం అన్వేషిస్తున్నాడు.

Cats Care

వేలు, లక్షల కోట్ల ఆస్తి ఉన్న వాళ్లు తమకిష్టమైన జంతువుల పేరు మీద కోట్ల రూపాయల ఆస్తులు జమ చేయటం గురించి వినే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మాత్రం ఇందుకు భిన్నమైనది. ఓ వృద్ధుడు పెంపుడు పిల్లి కోసం తన ఆస్తి మొత్తం రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది కూడా ఆ పిల్లిని సురక్షితంగా పెంచే వారికి ఆస్తి దారాదత్తం చేస్తానంటున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన 82 ఏళ్ల లాంగ్ అనే వ్యక్తి భార్య పదేళ్ల క్రితం చనిపోయింది. అతడికి పిల్లలు కూడా లేరు.

భార్య చనిపోయినప్పటినుంచి ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అలాంటి అతడి జీవితంలోకి కొన్ని పిల్లులు వచ్చి చేరాయి. కొన్ని నెలల క్రితం.. ఓ వర్షపు రోజున వీధిలో కొన్ని పిల్లులు దొరికాయి. వాటికి తల్లి లేకపోవటంతో ఇంటికి తెచ్చి పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లుల కారణంగా లాంగ్ ఒంటరితనం దూరం అయింది. అయితే, ఆ పిల్లుల్లో క్షియాన్బా అనే పిల్లి తప్ప మిగిలినవన్నీ అనారోగ్యం కారణంగా చనిపోయాయి. దీంతో లాంగ్‌కు క్షియాన్బాకు మధ్య బంధం బాగా పెరిగింది. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు.

అయితే, తను చనిపోతే ఆ పిల్లి పరిస్థితి ఏంటి ? అన్న భయం ఆయనకు పట్టుకుంది. తను చనిపోయిన తర్వాత కూడా క్షియాన్బాను ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమగా పెంచుకునే వారికోసం అన్వేషిస్తున్నాడు. ఈ మేరకు గాంగ్‌డాంగ్ రేడియో, టీవీల్లో దీనిపై ప్రకటన ఇచ్చాడు. ‘నేను చనిపోయిన తర్వాత నా పిల్లిని ప్రేమగా చూసుకునే వారు కావాలి. అది చనిపోయే వరకు ప్రేమగా చూసుకోవాలి. దానికి ప్రతిఫలంగా నా ఆస్తి మొత్తం రాసిస్తాను. నాకు ఓ అపార్ట్‌మెంట్, బ్యాంకులో సేవింగ్స్ ఉన్నాయి’ అని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారి కనిపించిన ఇరాన్ అధినేత

పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..

Updated Date - Jul 06 , 2025 | 12:39 PM