Share News

Doctor Anil Jit Singh: పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..

ABN , Publish Date - Jul 06 , 2025 | 08:38 AM

Doctor Anil Jit Singh: కాల్పులు జరిపిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Doctor Anil Jit Singh: పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..
Doctor Anil Jit Singh

ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పేషంట్‌నంటూ వచ్చి ఆయన ప్రాణాలు తీయబోయాడు. పాయింట్ బ్లాన్క్‌లో గన్ను పెట్టి నటి తండ్రిని కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ నటి తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నటి తానియ తండ్రి అనిల్‌జిత్ కాంభోజ్ ఓ డాక్టర్. ఆయన మోగ జిల్లాలోని హర్బన్స్ నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం ఓ ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గర ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి వచ్చారు. అనిల్‌జిత్ క్యాబిన్‌లోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన కాలికి ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆయనతో చెప్పాడు.


అనిల్ అతడి కాలిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రెండో వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న తుపాకి తీశాడు. అనిల్‌కు అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన చావుకేక పెట్టి.. కుర్చీలోంచి కిందపడిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే.. ఆ దుండగులు అనిల్ కోసం ఉదయం పది గంటల సమయంలో ఓ సారి వచ్చారు. డాక్టర్ లేడని తెలిసి వెనక్కి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.50కి మళ్లీ వచ్చి డాక్టర్‌పై కాల్పులకు తెగబడ్డారు. అనిల్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, ఆ ఇద్దరు అనిల్‌ను ఎందుకు చంపాలనుకున్నారన్నది తెలియరాలేదు.


ఇవి కూడా చదవండి

గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

అమెరికా పార్టీని ప్రారంభించిన ఎలన్ మస్క్

Updated Date - Jul 06 , 2025 | 10:09 AM