Share News

Gold And Silver Rate: గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 07:41 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,830 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు
Gold And Silver Rate

భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత ఇతర ఏ లోహానికి కూడా లేదు. శుభకార్యాలకు తప్పని సరిగా బంగారం అవసరం అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్లకు బంగారమే ప్రధానం. అలాంటి బంగారం నేడు అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోయింది. పేద, మధ్య తరగతి వాళ్లకు అందని ద్రాక్షగా మారింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. వారం క్రితం 99 వేల దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల బంగారం ధర.. ఇప్పుడు కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తోంది. ఇక, ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


నగరంలో బంగారం ధరలు..

హైదరాబాద్‌ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,830 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ధరలు నిలకడగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,830 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు..

నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12,000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పులేదు. 100 గ్రాముల వెండి ధర నేడు 12,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

అమెరికా పార్టీని ప్రారంభించిన ఎలన్ మస్క్

అంగరంగ వైభవంగా ప్రారంభమైన తానా 24వ మహాసభలు

Updated Date - Jul 06 , 2025 | 07:44 AM