Musk Launches America Party: అమెరికా పార్టీని ప్రారంభించిన ఎలన్ మస్క్
ABN , Publish Date - Jul 06 , 2025 | 07:07 AM
Musk Launches America Party: మస్క్ ఆ బిల్లును మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా మారారు. బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు.

‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మస్క్ ఆ బిల్లును మొదటినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌కు వ్యతిరేకంగా మారారు. బహిరంగంగా, సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నాడు. ట్రంప్ ప్రభుత్వం బిల్లును అమల్లోకి తెస్తే.. కొత్త పార్టీ ప్రారంభిస్తానని గతంలోనే స్పష్టం చేశాడు. ఈ మేరకు కొత్త పార్టీ పేరు కూడా ప్రకటించాడు.
‘అమెరికా పార్టీ’ అని దేశం పేరుతోటే పార్టీ పేరు పెట్టాడు. మస్క్ ఎంత అడ్డుకున్నా.. బిల్లు మాత్రం ఆగలేదు. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు అమల్లోకి వచ్చింది. బిల్లు అమల్లోకి రావటంతో .. మస్క్ ముందు చెప్పినట్లుగానే కొత్త పార్టీని ప్రారంభించాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో..
‘మన దేశాన్ని నష్టాలలోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి.. ఇవన్నీ చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావలసిన కొత్త రాజకీయ పార్టీ’ అని పేర్కొన్నాడు.