Israel Iran War: యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారి కనిపించిన ఇరాన్ అధినేత
ABN , Publish Date - Jul 06 , 2025 | 10:41 AM
Israel Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఆయుతుల్లా బయట కనిపించారు.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధ జరిగిన సంగతి తెలిసిందే. రెండు దేశాలు హోరాహోరీగా మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. దాదాపు 12 రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగింది. 12 రోజుల తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు వచ్చాయి. 10 రోజుల కిందట ఈ ఒప్పందం జరిగింది. అయితే, యుద్ధం కారణంగా ఇరాన్ బాగా నష్టపోయింది. వందల మంది చనిపోయారు. యుద్ధంలో 900 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఇజ్రాయెల్‌తో యుద్ధం సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా రోజుల తర్వాత ఆయుతుల్లా బయట కనిపించారు. శనివారం మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ఆయతుల్లా కుర్చీ దగ్గరకు రాగానే.. అక్కడి జనం పైకి లేచి ఆయనకు జేజేలు కొడుతూ ఉన్నారు.
ఆయన కుర్చీలో కూర్చున్నా జేజేలు మాత్రం ఆగలేదు. 41 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఆయతుల్లా ఖమేనీ 1989లో ఇరాన్‌లో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరాన్ అణు బాంబు తయారీకి అమెరికా పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దేశానికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు సైతం చేసింది.
ఇవి కూడా చదవండి
పేషంట్లమంటూ వచ్చి డాక్టర్‌ను కాల్చేశారు..
గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు