China: ఘోర ప్రమాదం.. 4 మృతి..17 మందికి గాయాలు..
ABN, Publish Date - May 23 , 2025 | 10:49 AM
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా, మరో 17 మంది శిథిలాల కింద పడి గాయపడ్డారు.
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుయిజౌ ప్రావిన్స్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. అంతేకాకుండా, మరో 17 మంది శిథిలాల కింద పడి గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. వారిని రక్షించడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, చైనాలోని టిబెట్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. టిబెట్‌లో ఉదయం 9:27 గంటలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) సమాచారం ఇచ్చింది.
Updated Date - May 23 , 2025 | 11:20 AM