ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump - Carney Apology: అమెరికా అధ్యక్షుడికి సారీ చెప్పా.. కెనడా ప్రధాని

ABN, Publish Date - Nov 01 , 2025 | 01:39 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత రిపబ్లికన్ నేత రోనల్డ్ రీగన్ కామెంట్స్‌ ఉన్న యాడ్ వివాదాస్పదం కావడంతో తాను డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పాననని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా తెలిపారు.

Mark Carney Apology Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: సుంకాలకు వ్యతిరేకంగా ప్రచురితమైన వివాదాస్పద యాడ్‌పై తాను అమెరికా ప్రెసిడెంట్‌కు క్షమాపణలు చెప్పానని కెనడా ప్రధాని మార్క్ కార్నీ శనివారం తెలిపారు. ఈ యాడ్ ట్రంప్‌నకు కోపం తెప్పించిందని అన్నారు. దక్షిణ కొరియాలో ఉన్న ఆయన జర్నలిస్టులతో ఈ కామెంట్స్ చేశారు. అమెరికాతో వాణిజ్య చర్చలు త్వరలో మొదలవుతాయని కూడా చెప్పారు. ఇందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు (Mark Carney Apology).

ఏమిటీ వివాదం

ట్రంప్ ప్రభుత్వం విధించిన టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఇటీవల ఓ యాడ్‌ను ప్రసారం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ దివంగత నేత రొనాల్డ్ రీగన్ అప్పట్లో సుంకాలపై చేసిన కామెంట్స్‌ను యాడ్‌లో చేర్చింది. సుంకాల వల్ల అమెరికాకు నష్టం అని రీగన్ అన్నట్టు యాడ్‌లో కనిపించింది.

ఈ యాడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పార్టీకి చెందిన ప్రముఖ నేత కామెంట్స్‌‌ను దుర్వినియోగ పరిచారంటూ మండిపడ్డారు. దీంతో, యాడ్‌ను తొలగిస్తామని రాజీకొచ్చిన కెనడా ఆ వారాంతంలో మాత్రం యాడ్ యథావిధిగా ప్రసారం అవుతుందని స్పష్టం చేసింది.

దీంతో, ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమైపోయారు. వారాంతంలో మాత్రం యాడ్ ప్రసారం అవుతుందని చెప్పడం దుందుడుకుతనమే అని మండిపడ్డారు. కెనడాతో వాణిజ్య చర్చల్లో జరగవని తేల్చి చెప్పారు. అదనంగా 10 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కెనడా వెనక్కు తగ్గింది. ట్రంప్‌నకు క్షమాపణలు చెప్పినట్టు కెనడా ప్రధాని కార్నీ తాజాగా మీడియా ముఖంగా చెప్పారు.

ఇక చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తాజాగా జరిగిన వాణిజ్య చర్చలు ఓ మేలి మలుపని కూడా ప్రధాని కార్నీ అభివర్ణించారు. కెనడా వ్యవహారాల్లో విదేశీ జోక్యం వంటి సున్నితమైన అంశాన్ని కూడా చైనా అధ్యక్షుడితో ప్రస్తావించినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

డిన్నర్‌కు వెళ్లిన బిలియనీర్లు... ఆ కస్టమర్లు హ్యాపీ!

చైనాతో ట్రంప్‌ రాజీ!

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 03:05 PM