BLA IED Blast: బీఎల్ఏ వరుస దాడులు.. 14 మంది పాక్ ఆర్మీ మృతి
ABN, Publish Date - May 08 , 2025 | 10:37 AM
BLA IED Blast: పాకిస్థాన్ ఆర్మీ వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా పాక్ ఆర్మీ వాహనంపై బలూచ్ లిబరేషన్ ఐఈడీ బాంబులతో దాడి చేసింది.
పాకిస్థాన్, మే 8: బీఎల్‌ఏ వరుస దాడులతో పాక్ ఆర్మీ (Pakisthan Army) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పాక్ ఆర్మీ వాహనంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఐఈడీ బాంబులతో పాక్ ఆర్మీ వాహనాన్ని పేల్చివేసింది. మాచ్‌కుండ్ ప్రాంతంలో బీఎల్‌ఏ దళాలు ఐఈడీ పేల్చాయి. ఈ దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. బలూచిస్థాన్‌లోని బిలాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు దాడుల్లో 14 మంది పాక్ ఆర్మీ హతమయ్యారు. బిలాన్‌లోని మాచ్‌లోని షోర్కాండ్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనిక కాన్వాయ్‌పై బీఎల్ఏ రిమోట్ క్రంటోల్ ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది సైనికులు మరణించారు. మరణించిన సైనికుల్లో స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ తారిక్ ఇమ్రాన్, సుబేదర్ ఉమర్ షరూక్ ఉన్నారు. ఈ పేలుడు ధాటికి వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఇక మరోచోట బీఎల్‌ఏ నిర్వహించిన రెండో దాడిలో ఇద్దరు పాక్ జవాన్లు మృతి చెందారు. కచ్‌లోని కులాగ్ టిగ్రామ్ ప్రాంతంలో పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడు బాంబులు అమర్చి ఇద్దరు సైనికులను హతమార్చారు. ఈ రెండు దాడులు తామే చేశామని బీఎల్‌ఏ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. అంతే కాకుండా పాక్ ఆర్మీపై బీఎల్‌ఏ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ ఆర్మీని కిరాయి ముఠాగా ప్రకటనలో తెలిపింది.
కాగా.. రెండు రోజుల క్రితం కూడా బలూచిస్థానలో జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పాక్ ఆర్మీ ప్రాణాలు కోల్పోయారు. కచ్చి జిల్లాలోని మాచ్ ప్రాంతంలో పాక్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఐఈడీతో పేల్చేశారు. ఈ పేలుళ్లో ఏడుగురు పాక్ సైన్యం మృతి చెందారు. అయితే ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులుగా పాకిస్థాన్ ఆర్మీ అనుమానిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వరుస పేలుళ్లు జరిగాయి. లాహోర్ వాల్టన్ రోడ్‌లోని సైనిక విమానాశ్రయం వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లను పాకిస్థాన్ అధికారులు ధృవీకరించారు. అయితే పేలుళ్ల నష్టంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ పేలుళ్లతో ముందస్తు చర్యల్లో భాగంగా లాహోర్ ఎయిర్‌పోర్టును మూసివేశారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడతో జనం భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: జమ్మూకాశ్మీర్‌లో పాక్ ఆర్మీ కాల్పులు.. 13 మంది మృతి
Rohit-Virat: ఆల్‌టైమ్ రికార్డ్ మిస్.. ఎంతపని చేశావ్ రోహిత్..
Read Latest International News And Telugu News
Updated Date - May 08 , 2025 | 11:02 AM