Epstein Scandal: క్లింటన్‌కూ ఎప్‌స్టైన్‌తో సంబంధాలు!
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:01 AM
ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్టై.. జైలులో మరణించిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు..
ఎప్‌స్టైన్‌కు బిల్ క్లింటన్ లేఖ..వాల్ స్ర్టీట్ జర్నల్ వెల్లడి
వాషింగ్టన్, జూలై 25: ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్టై.. జైలులో మరణించిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కూడా సంబంధాలున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఎప్‌స్టైన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా రూపొందించిన ప్రత్యేక ఆల్బమ్‌లో క్లింటన్ రాసిన ఓ లేఖకు కూడా చోటు కల్పించినట్లు.. అందులో క్లింటన్ స్వహస్తాలతో రాసిన అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తున్న భాగాలను వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని ఎప్‌స్టైన్ మాజీ ప్రేయసి మ్యాక్స్‌వెల్ ఆధ్వర్యంలో తయారు చేశారు. అందులో ట్రంప్, క్లింటన్ సహా.. వాల్ స్ట్రీట్ బిలియనీర్ లియోన్ బ్లాక్, ఫ్యాషన్ డిజైనర్ వేరావాంగ్, మీడియా అధినేత మోర్ట్ జుకెర్మన్ రాసిన లేఖలున్నాయి. బిల్ క్లింటన్ కవితాత్మకంగా అందులో లేఖ రాశారు. ఎప్‌స్టైన్‌ది చిన్నపిల్లాడి మనస్తత్వమని, సుదీర్ఘకాలం స్నేహాలను కొనసాగిస్తారని అందులో కొనియాడారు. 50 ఏళ్లు వచ్చినా.. ఇంకా కుర్రాడిలా ఉత్సాహంగా ఉంటారని, సాహసాలు చేస్తుంటారని పేర్కొన్నారు. క్లింటన్ రాసిన కొన్ని పదాలు అస్పష్టంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. కాగా.. 2019లో ఎప్‌స్టైన్ అరెస్టు కాకముందు.. క్లింటన్ అతనితో నాలుగు సార్లు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించడం గమనార్హం..! ఈ ప్రయాణాలన్నీ క్లింటన్ ఫౌండేషన్ ద్వారా జరిగినట్లు సమాచారం. వీరిద్దరూ 1993లో వైట్‌హౌ్‌సలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫొటో దిగారు. కాగా.. ఎప్‌స్టైన్ పుట్టిన రోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖ రాశారంటూ ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే..! ఆ కథనాన్ని ఖండించిన ట్రంప్.. వాల్ స్ట్రీట్ జర్నల్‌పై 10 బిలియన్ డాలర్ల మేర పరువు నష్టం దావా వేశారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 03:01 AM