ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bilawal Bhutto Threat: ఇలాగైతే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం ఉండదు: బిలావల్ భుట్టో హెచ్చరిక

ABN, Publish Date - Aug 12 , 2025 | 12:29 PM

సింధు జలాల ఒప్పందం నిలుపుదల ఇలాగే కొనసాగితే పాక్‌కు భారత్‌పై యుద్ధం మినహా మరో మార్గం ఉండదని పీపీపీ నేత బిలావల్ భుట్టో హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా ఏకం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Bilawal Bhutto War Threat India

ఇంటర్నెట్ డెస్క్: పాక్ నేత బిలావల్ భుట్టో (Bilawal Bhutto) భారత్‌పై మరోసారి పిచ్చి ప్రేలాపనలు చేశారు. యుద్ధం మినహా పాక్‌కు మరో మార్గం లేకుండా భారత్ పరిస్థితులు దిగజారుస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పాక్ దేశ ప్రజలు అందరూ ఏకం కావాలంటూ రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. సోమవారం సింధ్ ప్రావిన్స్ సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.

‘నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వ చర్యలు పాక్‌కు చాలా నష్టం కలిగించాయి. ఈ చర్యలకు మనమంతా ఐకమత్యంగా ఎదురొడ్డి నిలవాలి’ అని అన్నారు. సింధు జలాల ఒప్పందం నిలుపుదల ఇలాగే కొనసాగితే భారత్‌పై యుద్ధం మినహా పాక్‌కు మరో ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని వార్నింగ్ ఇచ్చారు. పాక్ ప్రజలు యుద్దానికి సమర్థులంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ‘మేము యుద్ధం ప్రారంభించ లేదు. కానీ, ఆపరేషన్ సిందూర్ లాంటి దాడులు మళ్లీ చేస్తే పాక్‌లోని అన్ని ప్రావిన్స్‌ల (రాష్ట్రాలు) ప్రజలు మీతో (భారత్) పోరాడేందుకు సిద్ధమే. ఈ యుద్ధంలో భారత్‌కు ఓటమి తప్పదు’ అని అన్నారు.

పహల్గాం ఉగ్ర దాడి తరువాత భారత్ పాక్‌పై ఆపరేషన్ సిందూర్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. పాక్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందం అమలును కూడా నిలిపివేసింది. దీంతో, పాక్‌లో నదీ జలాల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తప్పును సరిదిద్దుకోవాల్సిన పాక్ నేతలు తమ దేశ ప్రజల్లో భారత్‌పై అకారణ ద్వేషం రగిలించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్‌ మునీర్.. అణుబాంబు ప్రయోగిస్తామంటూ ఉన్మాదంతో ఊగిపోయారు. పాక్ ఉనికికి ముప్పు వస్తే తమతో పాటు సగం ప్రపంచం అంతమైపోతుందని హెచ్చరించారు. సింధు జలాలను అడ్డుకునేందుకు భారత్ చేపట్టే నిర్మాణాలను కూడా కూల్చేస్తామని అన్నారు. నిర్మాణాలు పూర్తయ్యే వరకూ వేచి చూసి ఆపై ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. సింధు జలాలు భారతీయ కుటుంబ ఆస్తి కాదని కామెంట్ చేశారు. ఈ నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో 250 మిలియన్‌ల మంది పాకిస్థానీలకు ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు.

మునీర్ వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ఈ బాధ్యతారహిత వ్యాఖ్యలను ప్రపంచం అర్థం చేసుకుందని కామెంట్ చేసింది. పాక్‌లో అణ్వాయుధాలకు భద్రత లేదని, అక్కడి మిలిటరీ టెర్రరిస్టులతో కుమ్మక్కై ఉందని ఈ వ్యాఖ్యలు మరోసారి స్పష్టం చేశాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

పని పూర్తి చేయడం మినహా మరో మార్గం లేదు.. ఇజ్రాయెల్ ప్రధాని

మరో బ్రిటన్ ఎఫ్-35 విమానంలో సాంకేతిక సమస్య.. జపాన్‌‌‌లో అత్యవసర ల్యాండింగ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 12 , 2025 | 12:40 PM