Home » Indus Water Treaty
భారత్, పాక్‌లో ప్రవహించే తావీ నదిలో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారత్.. దిగువ దేశమైన పాక్‌ను వరద ముప్పుపై అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. భారత హైకమిషన్ ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసినట్టు తెలుస్తోంది.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సరళ స్వభావి, నిబద్ధత కలిగిన నేత అని రాధాకృష్ణన్‌ను ప్రశంసించారు.
శత్రువుకు తిరుగులేని గుణపాఠం చెబుతామంటూ పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ తిప్పికొట్టారు. ఇలాంటి బెదిరింపులు భారత్ విషయంలో ఎంతమాత్రం పనిచేయవని అన్నారు.
యుద్ధం తప్పదంటూ పాక్ నేత బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఘాటుగా స్పందించారు. తిక్క రేగితే బ్రహ్మోస్ క్షిపణులను వరుస పెట్టి ప్రయోగిస్తామంటూ హెచ్చరించారు.
సింధు జలాల ఒప్పందం నిలుపుదల ఇలాగే కొనసాగితే పాక్‌కు భారత్‌పై యుద్ధం మినహా మరో మార్గం ఉండదని పీపీపీ నేత బిలావల్ భుట్టో హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా ఏకం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నీరు, రక్తం కలిసి ప్రవహించవని జైశంకర్ పునరుద్ఘాటించారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.
మళ్లీ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్థాన్. భారత్‌పై ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే శత్రుదేశం.. ఒక విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోకపోవడంతో ఇండియా సాయాన్ని అర్థిస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ ఏడాది జూన్ 2వ తేదీకి 1,28,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్యులు తక్కువని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్‌గా ఉన్న ఇండస్ రీవర్ సిస్టమ్ అథారిటీ (ఐఆర్ఎస్ఏ) పేర్కొంది.
ఆయుధ దాడులతో గాజా తీవ్ర కరవుకాటకాల్లో చిక్కుకుని మానవతా సంక్షోభాన్ని చవిచూస్తోందని, అది చాలదన్నట్టుగా నీటిని ఆయుధంగా మలుచుకునే పరిస్థితి ఇప్పుడు కళ్లముందు కనిపిస్తోందని షెహబాజ్ వ్యాఖ్యానించారు.
ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్‌బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.