Share News

PM Modi: నెహ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారు.. ప్రధాని మోదీ

ABN , Publish Date - Aug 19 , 2025 | 04:52 PM

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సరళ స్వభావి, నిబద్ధత కలిగిన నేత అని రాధాకృష్ణన్‌ను ప్రశంసించారు.

PM Modi: నెహ్రూ దేశాన్ని రెండు సార్లు విభజించారు.. ప్రధాని మోదీ
PM Modi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందం(Indus Water Treaty) వల్ల భారత్‌కు ఒరిగిందేమీ లేదని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. భారతదేశాన్ని నెహ్రూ రెండుసార్లు విభజించారని ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజిస్తే, 80 శాతం జలాలు పాకిస్థాన్‌కు ఇస్తూ సింధూ జలాల ఒప్పందంతో రెండోసారి విభజించారని, ఇది రైతు వ్యతిరేక ఒప్పందమని అన్నారు. జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో మంగళవారంనాడు జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మాట్లాడారు.


'నెహ్రూ దేశాన్ని ఒకసారి, మళ్లీ మరోసారి విభజించారు. సింధూ జలాల ఒప్పందం కింద 80 శాతం జలాలు పాక్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదంటూ తన సెక్రటరీ ద్వారా పొరపాటును ఒప్పుకున్నారు' అని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు ఇదే నిదర్శనమని చెప్పారు.


కాగా, ఇదే సమావేశంలో ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపీలకు మోదీ పరిచయం చేశారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన సరళ స్వభావి, నిబద్ధత కలిగిన నేత అని రాధాకృష్ణన్‌ను ప్రశంసించారు. అనంతరం రాధాకృష్ణన్‌ను ప్రధాని, ఎంపీలు సన్మానించారు.


ఇవి కూడా చదవండి..

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ తేదీ ఖరారు

ఉపరాష్ట్రపతి అభ్యర్థి.. నాలుగు దశాబ్దాల లీగల్ కెరీర్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 19 , 2025 | 04:55 PM