ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan: పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. ఫలితం లేకుండా పోయిన UNSC మీటింగ్

ABN, Publish Date - May 06 , 2025 | 10:27 AM

Big Jolt To Pakistan: ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి.

Big Jolt To Pakistan

ఐక్య రాజ్య సమితిలో పాకిస్తాన్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఐరాస భద్రతా మండలి మీటింగులో సభ్య దేశాలు పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచే విధంగా.. పాక్ క్షిపణి ప్రయోగాలు చేయటాన్ని సభ్యదేశాలు తప్పుబట్టాయి. పహల్గామ్ దాడులకు పాక్ బాధ్యత వహించాల్సిందేనని అన్నాయి. ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి.


దాదాపు గంటకు పైగా భద్రతా మండలి మీటింగ్ జరిగింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ మీద చర్చ జరగకుండా ఉండేందుకు పాక్ సభ్యుడు అసిమ్ లిఫ్తికర్ అహ్మద్ తీవ్రంగా ప్రయత్నించాడు. ఇండియాపై తప్పుడు ఆరోపణలు చేశాడు. కాశ్మీర్ ప్రస్తావన కూడా తెచ్చాడు. ఇండియా యుద్దానికి కాలు దువ్వుతోందని, రెచ్చగొట్టేలా మాట్లాడుతోందని అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా సింధు జలాలపై కూడా చర్చ జరిగింది. భారత్ సింధు జలాలను పాకిస్తాన్‌కు వెళ్లకుండా ఆపడాన్ని అసిమ్ తప్పుబట్టాడు. నీటిని ఆపడం.. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని అన్నాడు. అయితే, ఐరాస భద్రతా మండలి మీటింగ్ ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిపోయింది.


ఇవి కూడా చదవండి

Sai Rajesh: బాబిల్ ఖాన్ గొడవ.. మండిపడ్డ సాయి రాజేష్

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 10:48 AM