Home » UNO
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. జమ్మూకశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ భారత్‌పై షెహ్‌బాజ్ చేసిన ఆరోపణలను భారత్ తిరస్కరించింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగానికి.. దీటుగా బదులిచ్చింది భారత్.
ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఘర్షణల సమయంలో లైంగిక హింస నిర్మూలనపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఐక్యరాజ్యసమితి కార్యక్రమం కాస్తా ఓ దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ వేదిక అనే విషయం మరచిన యూఎన్ ఉన్నతాధికారి, ఇజ్రాయెల్ రాయబారి ఒకరిపై మరొకరు నోరుపారేసుకున్నారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం నియమించిన ఐజీఎన్ కమిటీ కో-చైర్స్ తాజాగా విడుదల చేసిన ‘ఎలిమెంట్స్ పేపర్’పై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు విధ్వంసాన్ని ఆపి చర్చలకు మొగ్గుచూపాలని ఆయన పిలుపునిచ్చారు.
లెబనాన్‌లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. లెబనాన్ మిషన్‌లో కూడా భారత సైనికులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రపంచ దృష్టిని ఆకర్షించే వేదికగా మరోసారి ఐక్యరాష్ట్ర సమితి (UNO) మళ్లీ రంగంలోకి దిగింది. 80వ సర్వసభ్య సమావేశం (UNGA 80) సెప్టెంబర్ 23 నుంచి 27 వరకు, 29న జరిగే ఉన్నత స్థాయి సాధారణ చర్చలతో కీలక మైలురాయిగా నిలవనుంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UNSC) భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి వాడివేడి వాదనలు కొనసాగాయి. కాశ్మీర్ అంశంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అస్పష్టత, ఇండస్ నీటి ఒప్పందంపై చర్చలు క్రమంగా తీవ్ర విమర్శలు చేసుకునే స్థాయికి చేరుకున్నాయి.
Big Jolt To Pakistan: ప్రధాని మోదీ, విదేశాంగమంత్రి జైశంకర్ దౌత్యం ఫలించింది. ప్రధాని మోదీ అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా దేశాధినేతలతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న పాక్ డిమాండ్‌కు.. భద్రతా మండలి సభ్య దేశాలు ఒప్పుకోమని తేల్చి చెప్పాయి.