Share News

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

ABN , Publish Date - May 06 , 2025 | 08:47 AM

Gold Price Today: నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,730 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,750 రూపాయలు.. 10 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 71,800 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధర బాగానే పెరిగింది.

Gold Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..
Gold Price Today

వారం రోజుల ముందు వరకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది. పసిడి ప్రియులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇక, పేద.. మధ్య తరగతి వారి గురించి చెప్పక్కర్లేదు. బంగారం కొనాలనుకునే ఆశల్నే చంపేసుకునే పరిస్థితికి వచ్చారు. అయితే, లక్షకు చేరిన తర్వాత ఊహించని విధంగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. హమ్మయ్యా.. ఇంకా కొంచెం తగ్గితే బంగారం కొనేద్దాం అనుకునేలోపే.. బంగారం బాదుడు మళ్లీ మొదలైంది. గత కొద్దిరోజులనుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి.


బంగారం ధరలు ఇలా..

నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,730 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,750 రూపాయలు.. 10 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర 71,800 రూపాయలు ఉండింది. ఈ రోజు బంగారం ధర బాగానే పెరిగింది. గ్రాముపై ఒక రూపాయి చొప్పున 10 గ్రాములపై 10 రూపాయలు పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 95,740 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87,760 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71,810 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇక వెండి విషయానికి వస్తే.. కొనుగోలుదారులకు శుభవార్తే అని చెప్పాలి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు వెండి ధర తగ్గింది. నిన్న 10 గ్రాముల వెండి ధర 1,080 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 10 గ్రాముల వెండిపై 1 రూపాయి తగ్గి 1079 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గి 1,07,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Viral Video: ప్రమాదంలో మహిళ ప్రాణాలు.. కుక్క ఎంత పని చేసింది..

Updated Date - May 06 , 2025 | 08:48 AM