ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dating Apps: ప్రాణాలకు ముప్పుగా మారిన డేటింగ్ యాప్స్.. ప్రభుత్వం హెచ్చరిక

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:40 PM

ఈ మధ్య కాలంలో యువత డేటింగ్ యాప్స్ (Dating Apps) ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇవే ప్రమాదకరంగా మారాయని అగ్రరాజ్యం చెబుతోంది. ఇటీవల జరిగిన కిడ్నాపుల విషయంలో వీటి ప్రమేయం ఉందని వెల్లడించింది. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Beware of Dating Apps

ఇటీవల కాలంలో డేటింగ్ యాప్స్‌ (Dating Apps) వినియోగించే వారి సంఖ్య పెరిగింది. అయితే తాజాగా ఈ యాప్స్ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమకోసం డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తులే.. చివరికు ప్రాణహాని తలపెడతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలు బయటపడ్డాయి. ప్రధానంగా మెక్సికోలో జరిగిన కిడ్నాప్ ఘటనలపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో డేటింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


కిడ్నాప్‌లకు ప్రధాన కారణం

అమెరికా కాన్సుల్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవల మెక్సికోలోని ప్యుర్టో వలార్టా, నుయేవో నయరిట్ ప్రాంతాల్లో పలువురు అమెరికన్ పౌరులు కిడ్నాప్‌ అయ్యారు. అయితే వారికి డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులే కిడ్నాప్ చేసి, విడిపించేందుకు భారీగా డబ్బు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఈ కిడ్నాప్‌లు ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదని, మెక్సికోలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రమాదం పెరుగుతున్నట్లు అధికారులు హెచ్చరించారు.


డేటింగ్ యాప్స్ వాడకం

ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం దాదాపు ప్రతి 10 మందిలో ముగ్గురు అమెరికన్లు డేటింగ్ యాప్‌లు వినియోగిస్తున్నట్లు తేలింది. ఇవి అక్కడి ప్రజల్లో పరిచయాల కోసం విస్తృతంగా ఉపయోగించే మార్గంగా తయారయ్యాయి. కానీ వాటి ద్వారా ఇప్పుడు స్కాములు, అపహరణల వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.


బహిరంగ ప్రదేశాల్లోనే..

ఈ క్రమంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తులను కలవాలనుకుంటే తప్పనిసరిగా పలు సూచనలు పాటించాలని అమెరికా కాన్సులేట్ వెల్లడించింది. మొట్టమొదటిసారి కలుస్తున్న వ్యక్తిని పబ్లిక్ ప్లేస్‌లో కలవాలని, ఒంటరిగా ఉండే ప్రాంతాలు, హోటల్ గదులు, వ్యక్తిగత నివాసాల వంటి ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. దీంతోపాటు ఎవరిని కలుస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయాలని చెప్పింది. మీరు కలిసే వ్యక్తి వివరాలు, యాప్ పేరు కూడా తెలుపాలన్నారు.


తక్షణ సహాయం కోసం..

పరిచయం అయిన వ్యక్తి విషయంలో ఏదైనా అనుమానం ఉంటే వెంటనే అత్యవసర హెల్ప్ లైన్ 911కి ఫోన్ చేయాలన్నారు. అదే సమయంలో అమెరికన్ పౌరులు దగ్గర్లోని అమెరికా కాన్సులేట్‌ను కూడా సంప్రదించవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ జలిస్కో ప్రాంతాన్ని Level 3 Reconsider Travel విభాగంలో చేర్చింది. అంటే అక్కడి పరిస్థితులు ప్రమాదకరంగా ఉండొచ్చని అర్థం. నయరిట్ ప్రాంతాన్ని Level 2 Exercise Increased Caution అని ప్రస్తావించింది. అంటే ఇది సాధారణ పరిస్థితుల కంటే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:43 PM