ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Los Angeles: తీవ్ర ఉద్రికత్తలు.. రిపోర్టర్‌పై కాల్పులు

ABN, Publish Date - Jun 09 , 2025 | 09:12 PM

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ ఆందోళనను కవర్ చేస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్‌పై కాల్పులు జరిగాయి. జర్నలిస్ట్ లారెన్ టోమాసి కాలుపై రబ్బరు బుల్లెట్‌తో కాల్చారు.

Los Angeles

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ ఆందోళనను కవర్ చేస్తున్నప్పుడు ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్‌పై కాల్పులు జరిగాయి. జర్నలిస్ట్ లారెన్ టోమాసి కాలుపై రబ్బరు బుల్లెట్‌తో కాల్చారు. ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. నైన్ న్యూస్ US కరస్పాండెంట్ అయిన లారెన్ టోమాసి ఆదివారం రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కొందరు నిరసనకారులు.. నువ్వు రిపోర్టర్‌ని కాల్చి చంపావంటూ అక్కడున్న పోలీస్‌ల మీద గట్టిగా అరిచారు. అయితే, కాల్పులు జరిగిన వెంటనే నిరసనకారులు రిపోర్టర్ శ్రీమతి టోమాసిని ఎలా ఉన్నారంటూ అడిగారు. దానికి ఆమె బాగున్నానంటూ సమాధానమిచ్చింది. ఇంతలో, నైన్ న్యూస్ ఈ ఘటనపై స్పందించింది. లారెన్ టోమాసి, ఆమె కెమెరా ఆపరేటర్ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని, వాళ్లు తమ కవరేజ్ కొనసాగిస్తారని తెలిపింది.

ఇలా ఉండగా, అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ వలసదారుల ఆందోళనలు.. దాడులతో అట్టుడికిపోతోంది. డౌన్‌టౌన్‌లో కర్ఫ్యూ విధించారు. ఇమిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) విభాగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 2,000 మంది ఆందోళనకారులు డౌన్‌టౌన్‌లోని ప్రధాన హైవే పై భారీ ఎత్తున నిరసనలకు దిగారు. అనేక సెల్ఫ్‌డ్రైవింగ్‌ కార్లకు నిప్పు పెట్టారు. చాలా పోలీసు వాహనాలు తగులబెట్టారు. దీంతో లాస్‌ ఏంజెలెస్‌లో మాస్కుల్లో ఉన్న ఆందోళనకారులను అరెస్టు చేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరిగిన ఆందోళనల నేపథ్యంలో మాస్క్‌ల వినియోగాన్ని ట్రంప్ నిషేధించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, లాస్‌ ఏంజెలెస్‌ స్థానిక ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇవి కూడా చదవండి..

వర్తమానం ఊసెత్తకుండా 2047 గురించి కలలా?

ఘోర ప్రమాదం.. రైలు నుంచి పడి ఐదుగురు మృతి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 09:19 PM