ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Osman Hadi killing accused: అతడిని నేను చంపలేదు.. వీడియో విడుదల చేసిన హాదీ హత్యకేసు నిందితుడు

ABN, Publish Date - Dec 31 , 2025 | 03:18 PM

డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి మేఘాలయ గుండా భారత్‌లోకి ప్రవేశించి అక్కడే తలదాచుకుంటున్నారంటూ ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను తాజాగా ఓ వీడియో విడుదల చేసి ఫైసల్ ఖండించాడు.

Osman Hadi murder case

భారతదేశ వ్యతిరేకి, బంగ్లాదేశ్ విద్యార్థి నేత ఒస్మాన్ హాదీ హత్య కేసు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తోంది. హాదీ హత్యకేసు నిందితుడు ప్రస్తుతం భారత్‌లోనే తలదాచుకుంటున్నాడని బంగ్లా నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే అవన్నీ అవాస్తవాలని హాదీ హత్యకేసు నిందితుడు ఫైసల్ కరీమ్ మసూద్ తేల్చి చెప్పాడు. తాజాగా ఫైసల్ ఓ వీడియోను విడుదల చేసి తాను దుబాయ్‌లో ఉన్నట్టు పేర్కొన్నాడు (Anti-India leader Osman Hadi).

'హాదీతో నాకు కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టుల కోసమే నేను అతడికి రాజకీయ విరాళాలు ఇచ్చాను. అతడిని చంపాల్సిన అవసరం నాకు లేదు. ఈ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. అందుకే ప్రాణభయంతో దుబాయ్‌కు పారిపోయి వచ్చా. ఈ హత్య వెనుక జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం హస్తం ఉంది` అని ఫైసల్ కరీమ్ తేల్చి చెప్పాడు (Osman Hadi killing accused).

డిసెంబర్ 12వ తేదీన హాదీపై దాడి జరిగిన తర్వాత ఫైసల్, ఆలంగీర్ షేక్ వంటి నిందితులు దేశం దాటి పారిపోయారని బంగ్లా పోలీసులు గుర్తించారు (Dubai claim Osman Hadi case). మేఘాలయ గుండా భారత్‌లోకి ప్రవేశించి అక్కడే తలదాచుకుంటున్నారంటూ ఢాకా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను భారత భద్రతా దళాలు, మేఘాలయ పోలీసులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి ఎవరూ భారత్‌లోకి రాలేదని, బంగ్లాదేశ్ పోలీసులు ప్రజలను తప్పుదారి పట్టించేందుకే నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి..

బరువు తగ్గేందుకు జైలుకు వెళ్తున్నారు.. చైనాలో వింత ట్రెండ్ గురించి తెలిస్తే..


మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో మొత్తం ఎన్ని తాబేళ్లున్నాయో కనిపెట్టండి..

Updated Date - Dec 31 , 2025 | 03:29 PM