China weight loss: బరువు తగ్గేందుకు జైలుకు వెళ్తున్నారు.. చైనాలో వింత ట్రెండ్ గురించి తెలిస్తే..
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:58 PM
అధిక బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్లడం, డైటింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం జైళ్లకు వెళ్తున్నారు. ఈ ట్రెండ్ గురించి చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.
లావుగా, ఊబకాయంతో ఉండడం ఎవరికీ నచ్చదు. లావుగా ఉండే వాళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేం. సామాజికంగానే కాదు.. ఆరోగ్య పరంగా కూడా పలు సమస్యలు ఎదురవుతాయి. అందుకే అధిక బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్లడం, డైటింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం జైళ్లకు వెళ్తున్నారు. ఈ ట్రెండ్ గురించి చాలా ఆందోళన వ్యక్తమవుతోంది (China weight loss jail).
చైనాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు 'ఫ్యాట్ ప్రిజన్'లకు వెళ్తున్నారు. లావుగా ఉన్న వారు ఈ శిబిరాలకు వెళ్లి 28 రోజుల పాటు కఠినమైన నియమాలు పాటించాలి. ఆ శిబిరాల్లో రోజుకు 12 గంటల పాటు కఠినమైన వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. రోజూ ఉదయం 7:30 గంటలకు అలారంతో శిక్షణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత బరువు తూకం వేస్తారు. ఆ తర్వాత, గంటల తరబడి ఏరోబిక్స్, వెయిట్ లిఫ్టింగ్, అధిక-తీవ్రత కలిగిన వ్యాయామాలు, స్పిన్ తరగతులు నిర్వహిస్తారు. సాయంత్రం మళ్లీ బరువు తూకం వేస్తారు (China obesity crackdown).
మొత్తం శిబిరం చుట్టూ ఎత్తైన కంచెలు, తాళం వేసిన గేట్లు ఉంటాయి. ఇవి అన్ని సమయాల్లో మూసివేసి ఉంటాయి. ఒక్కసారి ఈ శిబిరంలోకి వెళ్లిన తర్వాత బయటకు రావడం అంత సులభం కాదు. ఎంతో అత్యవసరమైతే తప్ప బయటకు పంపించరు. వారు పెట్టిన ఆహారం మాత్రమే ఆ 28 రోజులూ తీసుకోవాలి. చిప్స్, స్వీట్లు, ఇతర జంక్ ఫుడ్స్ ఉండవు. ఈ శిబిరాలకు వెళ్లి 28 రోజుల్లో 10 కిలోలు తగ్గిన వారు చాలా మంది ఉన్నారు. దీంతో ఈ ట్రెండ్ చైనాలో జోరందుకుంటోంది (China health camps).
ఈ ఫ్యాట్ ప్రిజన్స్‌కు చైనాలో విపరీతమైన డిమాండ్ నెలకొంది (28 days slim China). అయితే ఈ శిబిరానికి హాజరైన ఓ 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల మరణించడంతో ఈ ఫ్యాట్ ప్రిజన్స్‌పై ఆందోళన మొదలైంది. అక్కడ బరువు తగ్గి బయటకు వచ్చిన వారు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నారని కొందరు కామెంట్లు చేశారు. నెల రోజుల్లో పది కిలోలు తగ్గడం ఆరోగ్యకరం కాదని నిపుణులు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..