ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Google Advisory: అమెరికాను వీడొద్దు.. వీసాదారులకు గూగుల్ హెచ్చరిక

ABN, Publish Date - Dec 20 , 2025 | 11:55 AM

గూగుల్ సంస్థ తన ఉద్యోగులకు కీలక హెచ్చరిక చేసింది. అమెరికాకు మళ్లీ తిరిగొచ్చేందుకు వీసా స్టాంపింగ్ అవసరమైన వారు దేశాన్ని వీడొద్దని సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Google Advisory to Visaholders in USA

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు కీలక సూచన చేసింది. అమెరికాకు తిరిగొచ్చేందుకు వీసా స్టాంపింగ్‌ అవసరమైన వారు విదేశీ పర్యటనలు పెట్టుకోవద్దని సూచించింది. ఈ మేరకు ఉద్యోగులకు సంస్థ అంతర్గత లేఖలో సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీసా స్టాంపింగ్‌కు సంబంధించి కొన్ని సందర్భాల్లో 12 నెలల వరకూ జాప్యం జరుగుతున్నట్టు ఉద్యోగులను గూగుల్ హెచ్చరించింది. హెచ్-1బీ, హెచ్-4, ఎఫ్, జే, ఎమ్ వీసాలతో గూగుల్‌లో పని చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఈ మెమో జారి చేసినట్టు సమాచారం. ‘ యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లల్లో వీసా స్టాంపింగ్‌లో చాలా ఆలస్యం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో 12 నెలల పాటు జాప్యం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి’ అని సంస్థ పేర్కొంది (Google Advisory To Employees).

ఈ నెల మొదట్లో అమెరికా విదేశాంగ శాఖ.. వివిధ వీసాదారుల సోషల్ మీడియా అకౌంట్‌ల పరిశీలనను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన విషయం తలిసిందే. ఇందుకోసం ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది మార్చ్‌, ఏప్రిల్ నెలలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఇక ఈ వాయిదాలు వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు తమ ఉద్యోగులను అప్రమత్తం చేస్తున్నాయి. ఇక విదేశీయుల రాక కట్టడి కోసం ట్రంప్ ప్రభుత్వం ఇటీవల హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్షడాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, అమెరికన్ల ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఈ ఫీజును తెచ్చినట్టు ప్రభుత్వం పేర్కొంది. వీసా పొందేందుకు తమ అర్హతలను నిరూపించుకున్న వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొంది.

ఇవీ చదవండి:

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పరిమితంగా ట్రంప్ ప్రస్తావన.. విమర్శల వెల్లువ

కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 20 , 2025 | 12:10 PM