Air India Cancels: న్యూఢిల్లీ వాషింగ్టన్ నాన్‌స్టాప్ సర్వీసులు రద్దు
ABN, Publish Date - Aug 12 , 2025 | 04:27 AM
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి..
విమానాల కొరత కారణంగా ఎయిరిండియా నిర్ణయం
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ మధ్య నాన్‌స్టాప్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. విమానాల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఎయిరిండియా వారానికి ఐదు నాన్‌స్టాప్ సర్వీసులు నడుపుతోంది. వీటికోసం విశాలంగా ఉండే బోయింగ్ 787 విమానాలను వినియోగిస్తోంది. సెప్టెంబరు 1 తర్వాత న్యూఢిల్లీ నుంచి వాషింగ్టన్‌కు వెళ్లేవారుగానీ, వాషింగ్టన్ నుంచి న్యూఢిల్లీకి వచ్చేవారుగానీ తమ విమానాలను బుక్ చేసుకుంటే.. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిరిండియా ప్రకటించింది. లేదంటే పూర్తి రిఫండ్‌తో టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని తెలిపింది.
Updated Date - Aug 12 , 2025 | 04:27 AM