ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Russia Diplomacy: రష్యాను వేడుకున్న పాకిస్తాన్..భారత్‎తో చర్చించండి ప్లీజ్..

ABN, Publish Date - May 05 , 2025 | 10:50 AM

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ రష్యా సహాయం కోరింది. ఇండియా నుంచి ఉద్రిక్తత తగ్గించాలని వేడుకుంది. ఇంకా ఏం చెప్పిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Pakistan Russia Diplomacy

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన భీకర ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత భారత్..పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతను తగ్గించేందుకు పాకిస్తాన్ రష్యా దౌత్యపరమైన సహాయం కోరింది. రష్యా TASS న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పాకిస్తాన్ రాయబారి జమాలీ రష్యా.. భారతదేశంతో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కలిగి ఉండటమే కాకుండా, పాకిస్తాన్‌తో కూడా బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ ద్వైపాక్షిక సంబంధాలను ఉపయోగించి, 1966లో తాష్కెంట్ చర్చల సమయంలో భారత్-పాకిస్తాన్ సాయుధ సంఘర్షణను ముగించడంలో రష్యా సానుకూల పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా మధ్యవర్తిత్వం వహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


రష్యా విదేశాంగ మంత్రి సలహా

ఈ క్రమంలోనే శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రెండు దేశాలు ఉద్రిక్తతను తగ్గించాలని కోరారు. 1972 షిమ్లా ఒప్పందం, 1999 లాహోర్ డిక్లరేషన్ స్ఫూర్తితో, మూడో పక్షం మధ్యవర్తిత్వం లేకుండా ద్వైపాక్షికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ ఒప్పందాలు భారత్-పాకిస్తాన్ మధ్య శాంతియుత వాతావరణాన్ని ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి.


దౌత్యం ద్వారా..

అదే సమయంలో పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా లావ్‌రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం జారీ చేసిన ప్రకటన ప్రకారం, దార్ ఇటీవలి ప్రాంతీయ పరిణామాల గురించి లావ్‌రోవ్‌కు వివరించారు. లావ్‌రోవ్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించడం ప్రాముఖ్యతను గుర్తు చేశారు. రెండు పక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతను నివారించాలని ఆయన సూచించారని విదేశాంగ కార్యాలయం తెలిపింది.


పహల్గామ్ ఉగ్రదాడి వివరాలు

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, మరో డజను మందికి పైగా గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇది లోయలో జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా నిలిచింది. ఈ దాడి తర్వాత భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు విస్తృత సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించాయి. సాధారణంగా జమ్మూలో రద్దీగా ఉండే ఈ పర్యాటక ప్రాంతం, దాడి తర్వాత నిర్మానుష్యంగా మారిపోయింది. ఈ క్రమంలో పర్యాటకం భారీగా పడిపోయింది. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి.


ఇవి కూడా చదవండి:

Tom Bailey: మ్యాచ్ ఆడుతున్న క్రమంలో జేబులోంచి పడిన మొబైల్.. వీడియో వైరల్


Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం


Punjab Kings: ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ సరికొత్త రికార్డ్..పట్టికలో కూడా..


Virat Kohli: ఆరెంజ్ క్యాప్‌ తిరిగి లాగేసుకున్న విరాట్ కోహ్లీ..ఇలాగే ఉంటుందా..


Read More Business News and Latest Telugu News

Updated Date - May 05 , 2025 | 10:50 AM