ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake: నేపాల్‌లో భూకంపం

ABN, Publish Date - May 20 , 2025 | 04:52 PM

కాస్కి, చుట్టుపక్కల జిల్లాల్లోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ సహా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అధికారులు చెప్పారు. నేపాల్‌లో వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో భూకంపం ఇది.

ఖాట్మాండ్: నేపాల్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీని తీవ్రత 4.7గా నమోదయింది. రాజధాని నగరం ఖాట్మండు నుంచి 250 కిలోమీటర్ల దూరంలోని కాస్కి జిల్లాలోని సినువా ప్రాంతంలో భూకంప కేంద్ర ఉన్నట్టు జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం (NEMRC) తెలిపింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్‌


కాగా, ఈ భూకంపంలో ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు ఇంకా ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు. కాస్కి, చుట్టుపక్కల జిల్లాల్లోని తనహు, పర్వత్, బాగ్లుంగ్ సహా కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయని చెప్పారు. నేపాల్‌లో వారం రోజుల్లో చోటుచేసుకున్న రెండో భూకంపం ఇది. మే 14న తూర్పు నేపాల్‌లోని సోలుకుంభు జిల్లాలో 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ ఘనటలో ఎలాంటి నష్టం జరగలేదు. దీనికి ముందు ఫిబ్రవరి 28న ఖట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. టిబెట్‌తో సరిహద్దు వెంబడి హిమాల పర్యత ప్రాంతానికి దగ్గర్లోని సింధుపాల్‌చోక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ చర్చలపై ట్రంప్ కీలక ప్రకటన..

గాజాను స్వాధీనం చేసుకుంటాం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 12:52 PM