Share News

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్‌

ABN , Publish Date - May 20 , 2025 | 04:46 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రమై ఎముకల వరకు వ్యాప్తి చెందింది అని కార్యాలయం తెలిపింది.

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్‌కు క్యాన్సర్‌

వాషింగ్టన్‌, మే 19: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (82) ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యిందని.. ఆందోళనకర స్థాయిలో వ్యాధి తీవ్రత ఉందని, ఎముకలకూ వ్యాపిస్తోందని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైడెన్‌కు క్యానర్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ‘విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. బైడెన్‌ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్

భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 20 , 2025 | 04:46 AM