ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump Claims: సబ్ మెరైన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్.. 25 వేల మంది సేఫ్..

ABN, Publish Date - Oct 19 , 2025 | 08:40 AM

అమెరికా ప్రభుత్వం డ్రగ్స్ రవాణాపై దృష్టి సారించింది. సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ తీసుకెళుతున్న ఆరు వాహనాలను ధ్వంసం చేసింది.

Donald Trump Claims

డ్రగ్స్ రవాణా చేస్తున్న సబ్ మెరైన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. శనివారం జరిగిన ఈ దాడిలో సబ్‌ మెరైన్ ధ్వంసం అయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరిని అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుంది. కొన్ని గంటల తర్వాత వారిని సొంత దేశాలకు పంపేసింది. ఈ ఎయిర్ స్ట్రైక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు.. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘పెద్ద మొత్తంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న సబ్ మెరైన్‌ను ధ్వంసం చేయటం గౌరవంగా భావిస్తున్నా.

అమెరికా వైపు వస్తుండగా దాన్ని ధ్వంసం చేశాం. ఆ సబ్ మెరైన్‌లో ఫెంటనైల్‌తో పాటు ఇతర నార్కోటిక్స్ ఉన్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ ధ్రువీకరించింది. ఆ సబ్ మెరైన్‌లో నలుగురు నార్కో టెర్రిరిస్టులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ నలుగురిలో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దర్ని వారి సొంత దేశాలు ఈక్వేడార్, కొలంబియాలకు పంపేశాము. ఆ సబ్ మెరైన్ అమెరికా తీరానికి చేరుకుని ఉంటే 25 వేల మంది దాకా చనిపోయి ఉండేవారు. ఈ ఘటనలో అమెరికా సైన్యానికి ఏమీ కాలేదు. నా దృష్టిని దాటి భూభాగం నుంచి కానీ, సముద్రం నుంచి కానీ డ్రగ్స్ అమెరికాలోకి రాలేవు’ అని అన్నారు.

కాగా, అమెరికా ప్రభుత్వం డ్రగ్స్ రవాణాపై దృష్టి సారించింది. సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ తీసుకెళుతున్న ఆరు వాహనాలను ధ్వంసం చేసింది. దాదాపు 27 మంది నార్కో టెర్రరిస్టుల ప్రాణాలు తీసింది. అయితే, న్యాయ నిపుణులు మాత్రం దీన్ని తప్పుబడుతున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారినైనా సరే చంపటం అక్రమమేనని అంటున్నారు. ఇక, ఆ సబ్ మెరైన్ ఏ దేశం నుంచి అమెరికాకు వచ్చిందనేది తెలియరాలేదు. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

ప్రేమ పేరుతో హనీ ట్రాప్.. ప్రియురాలి మోసం భరించలేక..

బ్యాంకాక్ రోడ్డుపై ఇండియన్ పిచ్చిపని.. దెబ్బకు ఏడ్చేశాడు..

Updated Date - Oct 19 , 2025 | 11:42 AM