Health News: మల విసర్జన చేయడానికి మంచి టైం ఏది.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
ABN, Publish Date - Jun 01 , 2025 | 07:19 PM
The Best Time of the Day to Poop: అందరికీ ఉదయం పూట బోవెల్ మూమెంట్స్ ఉండవు. అందులో సమస్య ఏమీ లేదు. రోజులో మూడు సార్లు మల విసర్జన చేయటం లేదా వారంలో మూడు సార్లు మాత్రమే మల విసర్జన చేయటం అన్నది సాధారణ విషమని డాక్టర్లు చెబుతున్నారు.
ఏం తింటున్నాం.. ఎంత తింటున్నామని మాత్రమే కాదు.. మల విసర్జనపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రోజులో ఎన్ని సార్లు వెళుతున్నాం.. మలం తీరును బట్టి మన ఆరోగ్య పరిస్థితి చెప్పేయవచ్చు. మల విసర్జన విషయంలో చాలా మందిని వేధించే ప్రశ్న ఏంటంటే.. రోజులో ఏ సమయంలో మల విసర్జన చేయటం మంచిది అని.. దీనిపై గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే.. ఉదయం లేవగానే మల విసర్జనకు వెళ్లటం అన్నది చాలా మంచిదట. మన శరీరానికి చాలా మేలు జరుగుతుందట.
సాధారణంగా మనం నిద్రపోయిన తర్వాత జీర్ణ వ్యవస్థకు పోషకాలను గ్రహించటంలో చాలా సమయం దొరుకుతుంది. ఆ తర్వాత వ్యర్థాలను పెద్ద పేగుల్లోకి తోస్తుంది. నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత.. జీర్ణ వ్యవస్థ మల విసర్జన చేయమంటూ సిగ్నల్స్ పంపుతుంది. అయితే, అందరికీ ఉదయం పూట బోవెల్ మూమెంట్స్ ఉండవు. అందులో సమస్య ఏమీ లేదు. రోజులో మూడు సార్లు మల విసర్జన చేయటం లేదా వారంలో మూడు సార్లు మాత్రమే మల విసర్జన చేయటం అన్నది సాధారణ విషమని డాక్టర్లు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు
ఉదయం పూట మల విసర్జన చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. మొదటగా మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతీ రోజూ బోవెల్ మూమెంట్స్ అవ్వటం వల్ల కడుపు ఉబ్బరం, మల బద్దకం తగ్గుతాయి. మనం శరీరంలోని చెత్త ఉదయాన్నే బయటకు వెళ్లిపోవటం వల్ల శరీరం ఎంతో ఉత్సాహంగా తయారు అవుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుంది. మెంటల్ క్లారిటీ వస్తుంది.
ఇవి కూడా చదవండి
వదిన తల నరికి పోలీస్ స్టేషన్‌కు పట్టుకెళ్లిన మరిది
రైలును పట్టాలు తప్పించడానికి భారీ కుట్ర..
Updated Date - Jun 01 , 2025 | 07:23 PM