Share News

Train Derailment Attempt: రైలును పట్టాలు తప్పించడానికి భారీ కుట్ర..

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:37 PM

Train Derailment Attempt: షహరాన్‌పూర్-ఢిల్లీ ఫ్యాసింజర్ రైలు శనివారం అర్ధరాత్రి షామ్లీ జిల్లాలోని బల్వా గ్రామంలో వెళుతూ ఉంది. ఓ చోట రైలు పట్టాలపై భారీ ఇనుప పైపు ఉండటం లోకో పైలట్ గుర్తించాడు.

Train Derailment Attempt: రైలును పట్టాలు తప్పించడానికి భారీ కుట్ర..
Train Derailment Attempt

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని కొందరు దుర్మార్గులు రైలును పట్టాలు తప్పించడానికి భారీ కుట్ర చేశారు. రైలు పట్టాలపై ఏకంగా భారీ ఇనుప పైపును, సిమెంట్ పైపును అడ్డంగా పెట్టారు. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించటంతో కుట్ర భగ్నం అయింది. వందలాది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


షహరాన్‌పూర్-ఢిల్లీ ఫ్యాసింజర్ రైలు శనివారం అర్ధరాత్రి షామ్లీ జిల్లాలోని బల్వా గ్రామంలో వెళుతూ ఉంది. ఓ చోట రైలు పట్టాలపై భారీ ఇనుప పైపు ఉండటం లోకో పైలట్ గుర్తించాడు. పైపునకు అడుగుల దూరంలో ఉండగానే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైలు ఠక్కున ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కిందకు వచ్చి చూడగా.. ఇనుప పైపునకు కొద్ది దూరంలో భారీ సిమెంట్ పైపు కూడా పెట్టి ఉంది. అంతేకాదు.. రైలు పట్టాలపై వరుసగా రాళ్లు పేర్చి ఉన్నాయి.


రైల్వే పోలీస్ అధికారి చంద్రవీర్ సింగ్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘ ఎవరో గుర్తు తెలియని దుండగులు ఓ భారీ ఇనుప పైపును రైల్వే ట్రాకుకు అడ్డంగా పెట్టారు. ట్రైన్ డ్రైవర్ సరైన సమయంలో స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది’ అని అన్నారు. ఈ సంఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇవి కూడా చదవండి

పిల్లాడితో కలిసి ఫుట్ బాల్ ఆడిన కాకి..

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు.. హసీనాపై అధికారిక అభియోగాలు

Updated Date - Jun 01 , 2025 | 06:51 PM