ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sleeping Tips: రాత్రిపూట ఫోన్‌ను పక్కన్నే పెట్టుకుని నిద్రపోతున్నారా.. జాగ్రత్త..

ABN, Publish Date - May 17 , 2025 | 02:28 PM

ప్రశాంతమైన, సురక్షితమైన నిద్ర కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. రాత్రిపూట ఫోన్‌ను పక్కన్నే పెట్టుకుని నిద్రపోతున్నారా? అయితే, మీకు ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లకు బానిసలయ్యారు. ఎంతంటే నిద్రలేచిందే మొదలు రాత్రి పడుకునే వరకు దానితోనే ఉంటున్నారు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దిండు దగ్గర మొబైల్ ఫోన్లు పెట్టుకుంటున్నారు. కానీ, కానీ, రాత్రిపూట మొబైల్ ఫోన్‌ను దిండు పక్కన పెట్టుకుని నిద్రపోవడం మంచిదేనా? ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇలా సెల్ ఫోన్‌ను పక్కన్నే పెట్టుకోని నిద్రపోవడం వల్ల మెదడుకు నేరుగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని WHO హెచ్చరిస్తోంది. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ రేడియేషన్ ప్రమాదకరమని అంటున్నారు.


మీ మొబైల్ ఫోన్ దగ్గర పెట్టుకుని నిద్రపోతే ఏమవుతుంది?

  • మెదడు నిరంతరం చురుగ్గా ఉంటుంది. సెల్ ఫోన్‌ నుండి వచ్చే కాంతి కారణంగా ఇది నిద్రను నిరోధిస్తుంది.

  • మొబైల్ ఫోన్ రేడియేషన్ వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.

  • పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. ఇది నిద్రలేమికి దారితీస్తుంది.

  • నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు పెరిగే అవకాశం ఉంది.

  • ఏదో ఒక సమయంలో మొబైల్ ఫోన్లు వేడెక్కి పేలిపోవచ్చు. దిండు పక్కన మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడం కూడా ప్రమాదకరం.


Also Read:

Dream Science: కలలో ఇవి కనిపిస్తున్నాయా.. మీ జీవితం నాశనం అవుతున్నట్లే..

Health Tips: పంటి నొప్పి ఉన్నప్పుడు వీటిని అస్సలు తినకండి..

NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

Updated Date - May 17 , 2025 | 02:31 PM