ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Okra Water: ‘ఓక్రా వాటర్‌’... ఇదీ మ్యాటర్‌!

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:01 AM

బెండకాయ... రుచికి బాగున్నా, బంకబంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే పచ్చి బెండకాయలను నీటిలో నానబెడితే దాన్ని ‘ఓక్రా వాటర్‌’ అంటున్నారు.

Okran Water

బెండకాయ... రుచికి బాగున్నా, బంకబంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే పచ్చి బెండకాయలను నీటిలో నానబెడితే దాన్ని ‘ఓక్రా వాటర్‌’ అంటున్నారు. ‘ఈ నీటిని తాగడం వల్ల రోగాలను పారదోలవచ్చ’ని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకీ ఓక్రా వాటర్‌ (బెండకాయ నీరు) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

ఇమ్యూనిటీ బూస్టర్‌గా...

బెండకాయ నీళ్లలో విటమిన్‌ ఏ, విటమిన్‌ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ప్రతీరోజు పొద్దున్న ఈ నీటిని తాగడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి మేలు..

బెండకాయలో సాల్యుబుల్‌ ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలను నివారించడంతో పాటు, గుండెఆరోగ్యానికి మేలు చేస్తుంది.

జీర్ణ వ్యవస్థ సాఫీగా..

ఈ నీరు మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియను సజావుగా చేయడంలో సహాయపడుతుంది. కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

చక్కెర స్థాయిల నియంత్రణ..

ఓక్రా వాటర్‌ మధుమేహం ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బెండకాయలో అధికంగా ఉండే సాల్యుబుల్‌ ఫైబర్‌ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గేందుకు..

బెండకాయ నీళ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ నీటిని తాగితే చాలాసేపటి వరకూ కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల అతిగా తినాలనిపించదు. శరీర బరువు అదుపులో ఉంటుంది.

చర్మానికి మేలు..

బెండకాయలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేయడంతో పాటు, చర్మం కాంతిమంతంగా మారుతుంది. ఇవి చర్మాన్ని హైడ్రేటెడ్‌గా, మృదువుగా ఉంచడంలో సహాయపడతాయి.

మరికొన్ని ప్రయోజనాలు:

  • బెండకాయల్లో ఉండే లెక్టిన్‌ అనే ప్రోటీన్‌ రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

  • బెండకాయ నీళ్లలో లుటీన్‌, జియాక్సంతిన్‌ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కళ్లను రక్షిస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి.

  • ఈ నీటిలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్‌ కె వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.

  • ఓక్రా వాటర్‌లోని ఫైబర్‌ పేగుల కదలికను మెరుగు పరుస్తుంది. అరుగుదల సమస్యలు రాకుండా, మలబద్ధకం దరిచేరకుండా కాపాడుతుంది.

  • ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకున్న చెడు కొలస్ట్రాల్‌ కరిగిపోతుంది. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి.

  • జుట్టు పెరుగుదలకు జిగురు దోహదపడుతుంది.

జాగ్రత్తలివి..

  • దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అతిగా తాగడం మంచిది కాదు.

  • కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ నీటిని తాగకపోవడమే బెటర్‌.

ఒకగ్లాసు ‘ఓక్రా వాటర్‌’లో ఉండే పోషకాలు, విటమిన్లు ..

సోడియం- 7 మి.గ్రా, కార్బోహైడ్రేట్స్‌- 7.45 గ్రాములు, ఫైబర్‌- 3.2 గ్రాములు, ప్రొటీన్‌- 1.93 గ్రాములు, ఫోలేట్‌- 80 మైక్రోగ్రాములు, పొటాషియం- 299 మి.గ్రా, విటమిన్‌ సి- 23 మి.గ్రా, విటమిన్‌ కె- 31 మి.గ్రా

తయారీ ఇలా..

నాలుగైదు తాజా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై వాటిని నిలువుగా లేదా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి ఒక గ్లాసు నీటిలో వేయాలి. రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయమే ఆ నీటిని వడగట్టుకుని పరగడుపున తాగాలి. రుచి కోసం ఈ నీటిలో కాస్త ఉప్పు, మిరియాల పొడి వేసుకోవచ్చు. లేదంటే కాసింత నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి.

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2025 | 08:35 PM