Monsoon Health Tips: వర్షాకాలంలో ఏ కూరగాయలు తినాలో తెలుసా..
ABN, Publish Date - Jun 27 , 2025 | 06:15 PM
వర్షాకాలంలో లేనిపోని రోగాలు వస్తుంటాయి. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఏ కూరగాయలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Monsoon Health Tips: వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే, వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి, సూక్ష్మక్రిములు, దోమలు వృద్ధి చెంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయలు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కాకరకాయ
వర్షాకాలంలో కాకరకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే, వర్షాకాలంలో వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
దొండకాయ
వర్షాకాలంలో దొండకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి.
బీరకాయ
వర్షాకాలంలో బీరకాయ కూర తినడానికి చాలా బాగుంటుంది. ఇది తేలికగా జీర్ణమయ్యే కూరగాయ. వర్షాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. బీరకాయలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
పొట్లకాయ
వర్షాకాలంలో పొట్లకాయ తినడం మంచిదే. పొట్లకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో, ఆహారం శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
తరచుగా ఆవలిస్తుంటే జాగ్రత్త.. మీ శరీరం చెప్పే ఆరోగ్య సంకేతాలు ఇవే!
మీరు ఆఫీస్‌కి వెళ్తారా..? తాజా సర్వేలో సంచలన విషయాలు..
For More Health News
Updated Date - Jun 27 , 2025 | 06:17 PM