ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

New Implant For Diabetes: మధుమేహం ఉన్నవారికి బిగ్ రిలీఫ్.. MIT కొత్త ఇంప్లాంట్ అభివృద్ధి.!

ABN, Publish Date - Jul 11 , 2025 | 12:10 PM

టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి త్వరలో బిగ్ రిలీఫ్ దక్కనుంది. MIT ఇంజనీర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యవసర ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేశారు. ఈ పరికరం టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి, వారి కుటుంబాలకు జీవన నాణ్యతను మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

New Implant For Diabetes

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. డయాబెటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది మీ శరీరంలో ఆహారాన్ని శక్తిగా మార్చే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ్యాధిలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి.

టైప్ 1 డయాబెటిస్:

ఇది సాధారణంగా బాల్యంలో లేదా కౌమారదశలో మొదలవుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం వల్ల ఈ టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.

టైప్ 2 డయాబెటిస్:

ఇది సాధారణంగా పెద్దవారిలో వస్తుంది. కొన్నిసార్లు పిల్లలు, టీనేజర్లలో కూడా రావచ్చు. ఇన్సులిన్ నిరోధకత లేదా తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల ఇది సంభవిస్తుంది.

గర్భధారణ డయాబెటిస్:

గర్భధారణ మధుమేహం అనేది గర్భధారణ సమయంలో స్త్రీలలో వచ్చే ఒక రకమైన మధుమేహం.

అయితే, టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిని రక్షించేందుకు MIT ఇంజనీర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యవసర ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రాణాపాయ పరిస్థితుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా పిల్లలు, యువకుల్లో కనిపిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడంతో, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఇబ్బందులు కలుగుతాయి. దీన్ని నియంత్రించేందుకు సాధారణంగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరమవుతుంటాయి. అయితే, MIT శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ చిన్న ఇంప్లాంట్.. ఇన్సులిన్‌కు ప్రత్యామ్నాయంగా గ్లూకాగాన్ అనే హార్మోన్‌ను అవసరమైనపుడు విడుదల చేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

  • ఈ పరికరం చర్మం కింద అమర్చేలా తయారు చేశారు.

  • ఇందులో ఒక చిన్న భాగం ఉంటుంది. అందులో పొడి గ్లూకాగాన్‌ను ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేలా చేశారు.

  • నికెల్-టైటానియం అనే ఒక ప్రత్యేక పదార్థం ఉపయోగించి ఈ పరికరం తయారు చేశారు.

  • రక్తంలో చక్కెర స్థాయి పూర్తిగా పడిపోయే సమయంలో ఇది అలర్ట్ అవుతుంది.

  • ఇది పొడి గ్లూకాగాన్‌ను విడుదల చేస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయి 10 నిమిషాల్లోపు సాధారణ స్థాయికి చేరుతుంది.

ప్రయోగ ఫలితాలు

  • ఈ పరికరాన్ని టైప్ 1 డయాబెటిస్ ఉన్న ఎలుకలపై పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా రోజుల పాటు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగలిగింది.

  • ప్రస్తుతం ఈ పరికరం జంతువుల్లో నాలుగు వారాల పాటు సురక్షితంగా పనిచేసింది. శాస్త్రవేత్తలు దీన్ని ఒక సంవత్సరం పాటు పనిచేసేలా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అన్నీ బాగుంటే మూడు సంవత్సరాల్లోపు మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశముంది.

Also Read:

వ్యాయామం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

ఉదయాన్నే కప్పు కాఫీలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?

For More Health News

Updated Date - Jul 11 , 2025 | 01:03 PM