Morning Health Tips: ఉదయాన్నే కప్పు కాఫీలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా?
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:09 AM
ప్రతిరోజూ ఒక కప్పు కాఫీలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగితే ఏమవుతుంది? ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది టీ కన్నా ఎక్కువగా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కచ్చితంగా కాఫీ తాగాల్సిందే లేదంటే బ్రెయిన్ పనిచేయదు అని చెప్పే వాళ్లు కూడా ఉన్నారు. కాఫీలో కెఫీన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇవి ఏకాగ్రతను పెంచడం, శక్తినివ్వడం, వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. అయితే, ఇలాంటి కాఫీలో చెంచా నెయ్యి కలిపి తాగితే ఏమవుతుంది? ఇలా తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక కప్పు కాఫీలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కాఫీలో నెయ్యి కలపడం వల్ల రుచి కూడా మెరుగుపడుతుందంటున్నారు. ఇది శక్తిని పెంచడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని అంటున్నారు. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కాఫీలోని కెఫిన్‌తో కలిసి పనిచేసి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని, అలాగే శక్తి స్థాయిలను పెంచుతాయని చెబుతున్నారు.
మెదడు పనితీరు:
నెయ్యిలోని కొవ్వులు, కాఫీలోని కెఫీన్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఏకాగ్రతను పెంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం:
నెయ్యి మలబద్ధకం సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది ప్రేగులను మృదువుగా చేసి, సులభంగా మలవిసర్జన జరిగేలా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
జీర్ణక్రియ:
నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడం:
కాఫీలో నెయ్యి కలుపుకోని తాగడం వల్ల కొవ్వులు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, కాఫీలో నెయ్యి కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
ఈ జంతువు పాలు చాలా డేంజర్.. ఎందుకంటే..
ఇవి తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.. జాగ్రత్త..
For More Health News